జనరల్తెలంగాణ

బుల్లెట్ బైకులు వాడుతున్నారా.. ఆ తప్పు చేస్తే భారీ జరిమానా..?

Bullet Bikes
దేశంలోని యువతలో చాలామంది బుల్లెట్ బైక్ ను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. బుల్లెట్ బైక్ చాలామందికి ఇష్టమైన బైక్ అయినప్పటికీ ఆ బైక్ పై ప్రయాణం చేస్తే ఇతరులు ఉలిక్కిపడే పరిస్థితి ఉంటుంది. బుల్లెట్ బైక్ చేసే శబ్దం చాలామందికి చిరాకు, అసహనం తెప్పిస్తుంది. చాలామంది వాహనదారులు బుల్లెట్ వాహనాలకు సైలెన్సర్లలో మార్పులు చేసి ఆ శబ్దం మరింతగా పెరిగేలా చేస్తున్నారు.

Also Read: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయంటే..?

బుల్లెట్ బైకుల నుంచి వస్తున్న శబ్ద కాలుష్యంపై ఫిర్యాదు అందడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో పాటు రవాణాశాఖ అధికారులు బుల్లెట్ బైక్ లపై తిరిగి వారిపై కొరడా ఝళిపిస్తున్నారు. సౌండ్ ఎక్కువ వచ్చే విధంగా సైలెన్సర్లను మార్చిన వాహనాలకు గుర్తించి కేసులు నమోదు చేయడంతో పాటు ట్రాఫిక్ పోలీసులు భారీ మొత్తం జరిమానా విధిస్తున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైలెన్సర్లను మార్చిన 550 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

Also Read: అమెజాన్ కస్టమర్లకు శుభవార్త.. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..?

శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు సైలెన్సర్ ను మార్చిన వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు మార్చిన సైలెన్సర్లను మెకానిక్ ల సహాయంతో తొలగించడంతో పాటు ఆ తరువాత వాహనాలను ట్రాఫిక్ పోలీసులు రవాణాశాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తున్న నేపథ్యంలో బుల్లెట్ బైకులు వాడుతున్న వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

మరిన్ని వార్తల కోసం: జనరల్

సైలెన్సర్లలో మార్పులు చేసి ఉంటే ఎక్కువ సౌండ్ రాకుండా సైలెన్సర్ లో మార్పులు చేయించుకుంటే మంచిది. లేకపోతే మాత్రం భారీ మొత్తంలో జరిమానా చెల్లించక తప్పదు. యథేచ్చగా రోడ్లపై వాహనాలను నడిపే వాహనదారులు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు.

Back to top button