టాలీవుడ్ప్రత్యేకంసినిమాసినిమా వార్తలు

ఎక్స్ క్లూజివ్ : ‘అరియానా’ పెళ్లిలో నిజమెంత !

Ariyana Glory

యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. బిగ్ బాస్ నాలుగో సీజన్ లో క్రేజీ హౌస్ మెట్ గా పాపులర్ అయిన భామల్లో ‘అరియానా గ్లోరీ’ కూడా ఒకటి. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక, ఈ బ్యూటీ హీరోయిన్ గా కూడా మారబోతుందని వార్తలు వచ్చాయి. కానీ, సడెన్ గా ఆమె గురించి ఇప్పుడు ఒక షాకింగ్ విషయం తెలిసిందంటూ కథనాలు మొదలయ్యాయి. ఆ కథనాల సారాంశం ఏమిటంటే ‘అరియానా’ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట.

ఇప్పటికే ఆమె పెళ్లి కూడా ఫిక్స్ అయిందనే వార్త వైరల్ అవుతుంది. అయితే, హీరోయిన్ అవుతుందని అనుకున్న ఆమె, మిస్ అరియానా నుండి మిసెస్ అరియానాగా మారబోతోందా అంటూ సోషల్ మీడియా ఆమె పెళ్లి పై డిస్కషన్స్ చేస్తున్నారు. మరి ‘అరియానా గ్లోరీ’ నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా ? అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో అని ఎంక్వైరీ చేస్తే.. అసలు నిజం బయట పడింది.

ఆమె పెళ్లి చేసుకోబోతుంది అని వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మరి ఎందుకు ఈ వార్త పుట్టింది అంటే.. అరియనా ఒక గోల్డ్ జువెల్లర్ బ్రాండ్ కోసం రీసెంట్ గా ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. కాగా ఆ కమర్షియల్ యాడ్ కోసం అరియనా పెళ్లి కూతురు గెటప్ లో దర్శనం ఇవ్వాల్సి వచ్చింది. ఆ రకంగా అరియనా పెళ్లి కూతురిగా కనిపించింది.

అలా ఆ పెళ్లి కూతురు గెటప్ లో తానూ దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దాంతో సోషల్ మీడియాలో ఆ ఫోటోలను చూసిన గాసిప్ రాయుళ్లు పై విధంగా ఒక పుకారును షికారు అయ్యేలా వైరల్ చేశారు.

Back to top button