టాలీవుడ్ప్రత్యేకంసినిమాసినిమా వార్తలు

అరెరే.. 38 ఏళ్ల హీరోయిన్ కి పెళ్లి కొడుకు కావాలట !

Trishaమాజీ బ్యూటీ త్రిష వయసు ప్రస్తుతం 38. అంటే, కరెక్ట్ ఏజ్ లో పెళ్లి అయి ఉంటే.. త్రిష కూతురు కూడా ఈ పాటికి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని కలలు కనడం మొదలెట్టేది. కానీ ఏమి చేస్తాం, ఇంకా త్రిషకే పెళ్లి కాకపాయే. ఒకపక్క త్రిష పెళ్లి అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. మరి ఇందులో నిజానిజాలు పరిస్థితి ఏమిటయ్యా అని ఎంక్వైరీ చేస్తే.. త్రిషకు ఇంకా సరైన పార్టనర్ దొరకలేదు. లైఫ్ పార్టనర్ కోసం చూస్తోంది.

కాబట్టి, త్రిష పెళ్లికి సంబంధించిన మేటర్ లో ఎలాంటి వాస్తవం లేదు. త్వరలోనే త్రిష పెళ్లి ఉంటుందని తమిళ మీడియా వర్గాలు రెండు సంవత్సరాల నుండి వార్తలను వండి వడ్డిస్తోంది. అయితే, త్రిష పెళ్లి చేసుకుంటుందంటూ పుకార్లు అయితే గట్టిగానే పుట్టిస్తున్నారు గానీ, త్రిష మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు. నిజానికి హీరో శింబు, త్రిష చాన్నాళ్లు డేటింగ్ చేశారు. ఆ తరువాత ఇద్దరి మధ్య వ్యవహారం చెడింది.

దాంతో శింబు నయనతారను వదిలించుకున్నట్టే త్రిషను కూడా పక్కన పెట్టాడు. కట్ చేస్తే.. త్రిష పై చాలా రూమర్స్ వచ్చాయి. రానాతో కూడా ఆమె ప్రేమలో ఉందని ఆ మధ్య బాగా వినిపించింది. కానీ రానా, మిహీక బజాజ్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు. మరోపక్క హీరో శింబు కూడా ఇప్పుడు సీరియస్ గా పెళ్లి గురించి థింక్ చేస్తున్నాడట. అతనికి ఓ నిర్మాత కుమార్తెతో పెళ్లి సెట్ అయిందని తెలుస్తోంది.

కాబట్టి, శింబు – త్రిష పెళ్లి అనే మరో వార్తలో కూడా కనీస నిజం కూడా లేదు. సో.. త్రిష పెళ్లి చేసుకోబోతుంది అంటూ వచ్చిన తంతంగం మొత్తంలో కేవలం గాసిప్ రాయుళ్ల తాపత్రయం మాత్రమే ఉందన్నమాట. ఏది ఏమైనా ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‌ గా ఒక వెలుగు వెలిగిన త్రిష అంటే.. ఇప్పటికీ అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఉంది.

నిజానికి కొన్నాళ్ల క్రితమే త్రిష పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంది. వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌ తో త్రిషకు ఎంగేజ్‌మెంట్ కూడా అయిన సంగతి తెలిసిందే. అయితే అతనితో కొన్నాళ్ళు డేటింగ్ కూడా చేసిన త్రిష, ఆ తరువాత అతనికి దూరం జరిగింది. వాస్తవానికి అతనే ఆమెను దూరం పెట్టాడని అన్నారు. సరే జరిగింది ఏమిటి అనేది పక్కన పెడితే, చివరకు త్రిష ఒంటరి అయింది. పుకార్లతో ఇలా వార్తల్లో నిలుస్తోంది పాపం.

Back to top button