అత్యంత ప్రజాదరణతెలంగాణ బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

హైదరాబాద్ కృష్ణా నగర్ ఏటీఎంలో చోరీకి యత్నం

Attempted robbery at an ATM in Krishna Nagar, Hyderabad

మొన్న కూకట్ పల్లిలోని హెచ్ డీ ఎఫ్ సీ ఏటీఎం వద్ద దొంగతనం, నిన్న గండి మైసమ్మ వద్ద ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీసు గోడకు కన్నం నేడు  కృష్ణా నగర్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎంలో చోరీకి యత్నం ఇలా వరుస ఘటనలు హైదరాబాద్ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కృష్ణానగర్‌లోని పంజాబ్ నేషన్ బ్యాంకు ఏటీఎం వద్దకు శుక్రవారం తెల్లవారుజాబున 2 గంటలకు ఓ యువకుడు బైక్ పై వచ్చాడు. ఆ తర్వాత స్క్రూ డైవర్లతో ఏటీఎంను ధ్వంసం చేసేందుకు యత్నించాడు. అంతలోనే పోలీసు పెట్రోలింగ్ వాహనం అటుగా రావడంతో ఆ దొంద బైక్ పై పరారీ అయ్యాడు. గతంలో ఏటీఎం టెక్నిషీయన్ గా పని చేసిన యువకుడే ఈ చోరీకి యత్నించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Back to top button