వ్యాపారము

ఆదాయపు పన్ను చెల్లించేవాళ్లకు షాకింగ్ న్యూస్..?

Income Tax

సాధారణంగా ఆదాయపు పన్ను చెల్లించే వాళ్లలో చాలామంది ఇతర ఆదాయాలను దాచి ఆదాయపు పన్ను చెల్లించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇలాంటి వాళ్లు ఇకపై జాగ్రత్తగా ఉండాలి. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఇకపై తమకు వచ్చే ప్రతి ఆదాయాన్ని నోట్ చేసుకోవడంతో పాటు ఆ ఆదాయానికి సంబంధించిన ఆధారాలను దాచిపెట్టుకోవాలి. ఆదాయపు పన్ను శాఖ ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఐటీ రిటర్నుల దాఖలును మరింత సులభతరం చేయనుంది.

Also Read: అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్ ఎలా తీసుకోవాలంటే..?

ఆదాయపు పన్ను శాఖ వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ముందుగానే పూర్తి చేసి ఆదాయపు పన్ను శాఖ రిటర్నులను అందజేయనుంది. ఆదాయపు పన్నును దాఖలు చేసే సమయంలో అసెసీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయడంలో ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన ఐటీఆర్ ఫారాలు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే పాక్షికంగా పూర్తి చేసిన ఫారాలను అందుబాటులో ఉంచింది.

ఆదాయపు పన్ను శాఖ ముందుగానే జారీ చేసే ఫారంలలో మూలధన రాబడితో పాటు డివిడెండ్ ఆదాయం, బ్యాంకులు, పోస్టాఫీస్ డిపాజిట్లపై వచ్చే ఆదాయాలకు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. ఇలా ముందే వివరాలను నింపడం వల్ల ఆదాయపు పన్ను చెల్లించే వాళ్లు ఆదాయాన్ని దాచడం సాధ్యం కాదు. ఆదాయపు పన్ను చెల్లించే వాళ్లలో కొంతమంది షేర్ల లావాదేవీలకు సంబంధించిన వివరాలను రిటర్నులలో నమోదు చేయడానికి ఇష్టపడరు. ఇలాంటి వాళ్లు కూడా ఇకపై జాగ్రత్తగా ఉండాలి.

Also Read: రైతులకు శుభవార్త.. ఈ పంట కిలో లక్ష రూపాయలు..?

మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో 75 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్లు రిటర్నులను దాఖలు చేయాల్సిన అవసరం లేదని వెల్లడించిన సంగతి తెలిసిందే. పింఛను, వడ్డీ ద్వారా ఆదాయం పొందుతున్న వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.

Back to top button