సినిమా వార్తలు

బాలయ్యకి హీరో కావాలి.. వెతుకులాటలో బోయపాటి !

Balayya Movie
నట సింహం బాలయ్య బాబు ‘అఖండ’ సినిమాలో ఒక మూగ – చెవిటి పాత్ర ఉందని.. ఇది నలభై నిమషాల కీలక పాత్ర అని.. ఈ పాత్రలో ఓ యంగ్ హీరో నటించబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో నటించడానికి ఏ హీరో ఒప్పుకోవడం లేదు. నాని, నిఖిల్ లాంటి హీరోలు మొహమాటం లేకుండా నో చెప్పేశారు. ఆ తరువాత నవీన్ పోలిశెట్టిని కూడా అడిగారు. అతను కూడా ఇంట్రస్ట్ చూపించలేదు అని తెలుస్తోంది.

ఆ తరువాత అల్లరి నరేష్ నటించబోతున్నాడని.. ఇంటర్వెల్ లో కామెడీ పోలీస్ ఆఫీసర్ గా నరేష్ కనిపిస్తాడని అన్నారు. అయితే నరేష్ కేవలం రెండు సీన్స్ లో మాత్రమే ఈ సినిమాలో కనిపిస్తాడట. నిజానికి, ఈ సినిమాలోని మూగ – చెమిటి పాత్రలో క్రేజీ హీరో నాగశౌర్య నటించబోతున్నాడని వార్తలు వచ్చినా.. అక్కడా ఎలాంటి రియాక్షన్ లేదట. మధ్యలో నాగశౌర్య నటించబోతున్నాడనే వార్త బాగా వైరల్ అయింది కూడా. చివరకు, ఈ వార్త కూడా రూమరే అని తేలిపోయింది.

ఇప్పటికీ ఏ హీరో దొరకలేదు. బోయపాటి యంగ్ హీరోల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. సహజంగా బాలయ్య సినిమాలో బాలయ్య ఒక్కరే హైలైట్ అవుతాడు కాబట్టి, ఏ హీరో నటించడానికి ఆసక్తి చూపించడం లేదు. కాగా యంగ్ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఎక్కడా వెనుక అడుగు వేయకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాతో ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు, మొన్న రిలీజ్ అయిన టీజర్ కూడా బాగా ఆకట్టుకుంది.

Back to top button