టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

‘అఖండ’తో బాలయ్య వార్నింగ్.. ‘కారుకూతలు కూస్తే.. !

ఉగాది పండగని పురస్కరించుకుని నట సింహం నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమా నుండి అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది. అఖండ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా నుండి బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కాగా ఈ పోస్టర్ లో అఘోర పాత్రలో బాలయ్య చేతిలో త్రిశూలంతో రౌద్రంగా కనిపించాడు. ఇక ఈ పాత్రకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. అఘోర పాత్రకు చాల తక్కువ డైలాగ్ లు ఉండవట. అలాగే ఆధ్యాత్మికతతో ఈ అఘోర పాత్ర చాల వైవిధ్యంగా అలాగే ప్రేరణాత్మకంగా ఉండబోతుందని కూడా తెలుస్తోంది.

మొత్తానికి బాలయ్య అభిమానుల ఉత్కంఠకు తెరదించుతూ అభిమానులకు బోయపాటి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ అందించాడు. ఇక ఈ చిత్రానికి ‘అఖండ’ అనే పేరు ఖరారు చేస్తూ ఓ వీడియోను పంచుకోవడం, ఈ వీరియోలో ‘కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌ చాలా బాగుంది. అలాగే ఆ మధ్య టీజర్ ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ లో బాలయ్య ఎప్పటిలాగే, పవర్ ఫుల్ డైలాగ్ అండ్ ఫుల్ యాక్షన్ తో అభిమానులను ఫుల్ గా అలరించడంతో ఫ్యాన్స్ కి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

అన్నట్టు ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. మరి చూడాలి ఈ సినిమా హిట్ అవుతుందో లేదో. ప్లాప్ అయితే మాత్రం ఇక బాలయ్యకి మార్కెట్ పూర్తిగా పోతుంది. కాబట్టి ఈ సినిమా హిట్ అవ్వాలని.. బాలయ్య అభిమానులు తపన పడుతున్నారు. మరి వారి తపనకు ఫలితం దక్కుతుందా ? చూడాలి.

Back to top button