టాలీవుడ్సినిమా

రిస్క్ చేస్తున్న బాల‌య్య‌!

Akhand Shooting

దేశంలో క‌రోనా ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. రోజుకు 4 ల‌క్ష‌ల కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో.. జ‌నం బెంబేలెత్తిపోతున్నారు. కొవిడ్ ప్ర‌భావం త‌ట్టుకోలేక సినిమా థియేట‌ర్లు ఎప్పుడో మూత‌ప‌డ్డాయి. ఇక‌, షూటింగులు కూడా ఒక్కొక్క‌టిగా ప్యాక‌ప్ చెప్పేశాయి. ప్ర‌స్తుతం ఒక‌టో రెండో చిత్రాలు మాత్ర‌మే షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. అది కూడా షెడ్యూల్ మ‌ధ్య‌లో ఉండ‌డంతో.. అవి కంప్లీట్ చేయాల‌ని చాలా కేర్ ఫుల్ గా ముందుకు సాగుతున్నాయి.

ఇలాంటి స‌మయంలో సెట్లో అడుగు పెట్టడానికి సై అంటున్నార‌ట బాల‌య్య‌. ఆయ‌న అప్ క‌మింగ్ మూవీ ‘అఖండ’ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. కొవిడ్ ఉధృతి పెర‌గ‌డంతో ఈ మ‌ధ్య‌నే షూటింగ్ నిలిపేశారు. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. మ‌ళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

మే 12 నుంచి కొత్త షెడ్యూల్ ఒక‌టి ప్లాన్ చేస్తున్నాడ‌ట ద‌ర్శ‌కుడు. ఈ షెడ్యూల్ ను చాలా త‌క్కువ మందితో కంప్లీట్ చేసే ఛాన్స్ ఉండ‌డంతోనే లైన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇందులో హీరో, హీరోయిన్ కే మేజ‌ర్ పార్ట్ ఉన్న‌ట్టు స‌మాచారం. కొన్ని రోజులు జూనియ‌ర్ ఆర్టిస్టుల‌తో ప‌ని ఉంటుందట‌. వారు కూడా ఓ 50 మంది అయితే స‌రిపోతార‌ట‌.

అందువ‌ల్ల ఈ చిన్న షెడ్యూల్ ను త‌క్కువ మందితో కంప్లీట్ చేయాల‌ని యూనిట్ చూస్తోంద‌ట‌. దీనికి బాల‌య్య కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు టైమ్ చెబితే సెట్స్ కు వెళ్ల‌డానికి సిద్ధంగా ఉన్నార‌ట‌. అయితే.. ఇప్ప‌టికే కొవిడ్ కండీష‌న్ చాలా సీరియ‌స్ గా ఉంది. ఇలాంటి సమ‌యంలో షూటింగ్ అంటే రిస్క్ చేయ‌డ‌మే అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Back to top button