టాలీవుడ్ప్రత్యేకంసినిమాసినిమా వార్తలు

బాలయ్యా అదిరిందయ్యా.. బోయపాటి నువ్వు ఘనాపాటి !

Akhanda Movie Teaserమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, యాక్షన్ హీరో బాలయ్య కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా ‘అఖండ’ చిన్న టీజర్ తో ఒక్కసారిగా అంచనాలను రెట్టింపు చేసుకుంది. పైగా టైటిల్ లోనే పవర్ ఉండటం, టీజర్ లో బాలయ్య నుండి వైవిధ్యం కనిపించడం.. అన్నిటికి మించి బాలయ్య గెటప్ సెటప్ అందరిపోవడం.. వీటన్నిటి కారణంగా ఎండమావుల్లో బిస్లరీ వాటర్ బాటిల్ దొరినట్టు అయింది నందమూరి అభిమానులకు.

ఏవరేజ్ హిట్ కూడా లేక ఆకలితో అలమటిస్తోన్న సింహానికి ఫుల్ మిల్స్(నాన్ వెజ్) దొరికితే ఎలా ఉంటుందో.. ఈ సినిమా బాలయ్యకి అలా దొరికినట్టు అనిపించింది. ఆ మాటకొస్తే.. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో సినిమా అంటేనే ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉంటాయి. అందుకే మొదటి నుండి బోయపాటి ఈ సినిమా పై మరింత కేర్ తో చాల జాగ్రత్తగా సినిమా తీశాడు. బడ్జెట్ పరంగా కూడా ఎన్నో సమస్యలు వచ్చాయి.

అయినప్పటికీ, బోయపాటి మాత్రం దేనిలో వెనుకడుగు వేయకుండా.. మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఈ అఖండ సినిమాని తీర్చిదిద్దాడట. ఇక ఈ సినిమాలో అఘోర పాత్ర గురించి ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తోంది. బాలయ్య ఇంతవరకు ఈ రేంజ్ మాస్ గెటప్ లో ఎప్పుడూ కనిపించలేదని.. చాల సంవత్సరాలు తరువాత బాలయ్య చేస్తోన్న ప్రయోగం ఈ గెటప్ అని తెలుస్తోంది.

ఇక బాలయ్య అఘోర గెటప్ లో “కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది… కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది…’ అంటూ హై వోల్టేజ్ వాయిస్ తో బాలయ్య పలికిన పవర్ ఫుల్ డైలాగ్ కూడా ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెబుతుంది. మొత్తానికి చాలా ఏళ్ల తరువాత బాలయ్య అభిమానులు మురిసిపోతున్నారు. బాలయ్య అదిరిందయ్యా.. బోయపాటి నువ్వు ఘనాపాటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Back to top button