ఓవర్సీస్ షో టైమింగ్స్సినిమాసినిమా రివ్యూస్

‘రూలర్’ మూవీ రివ్యూ

 

 • చిత్రం: రూలర్‌
 • నటీనటులు: బాలకృష్ణ, సొనాల్‌ చౌహాన్‌, వేదిక, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, భూమిక తదితరులు
 • సంగీతం: చిరంతన్‌ భట్‌
 • సినిమాటోగ్రఫీ: రామ్‌ ప్రసాద్‌
 • ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
 • నిర్మాత: సి.కల్యాణ్‌
 • కథ, సంభాషణలు: పరుచూరి మురళి
 • దర్శకత్వం: కె.ఎస్‌.రవికుమార్‌
 • రేటింగ్: 2.25/5

ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం రూలర్‌. తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు (శుక్రవారం ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటించారు. సీ కళ్యాణ్ సినిమాని నిర్మించగా, చిరంతన్‌ భట్ సంగీతమందించాడు. జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో మన సమీక్షలో చూద్దాం..

 

కథ : ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన మినిస్టర్ భవాని సింగ్ ఠాగూర్ కుటుంబానికి చెందిన కూతురు కులాంతర వివాహానికి పోలీస్ ఆఫీసర్ ధర్మా (బాలకృష్ణ) సపోర్ట్ గా నిలుస్తాడు. దీనితో భవాని సింగ్ ఆఫీసర్ ధర్మాని ఎలా అయిన అంతమోదించాలని అనుకుంటాడు. కానీ ఆఫీసర్ ధర్మా కాస్తా అర్జున్ ప్రసాద్ గా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి సి.ఈ.వో గా కనిపిస్తాడు. కంపెనీ పనిమీద బ్యాంకాక్ వెళ్ళిన అర్జున్ ప్రసాద్ పై అటాక్ జరుగుతుంది. ఇంతకి ఆ అటాక్ చేసింది ఎవరు ? అసలు ఈ ధర్మ ఎవరు? ఎందుకు అర్జున్ ప్రసాద్ ను ధర్మ అంటున్నారు? అన్నది తెరపైన చూడాల్సిందే.

 

విశ్లేషణ:బాలకృష్ణ సినిమా అంటే యాక్షన్‌, ఎమోషన్‌, డైలాగ్‌లు, ఇవన్నీ ఆశిస్తారు అభిమానులు. పాత్రలో వివిధ గెటప్‌లు ఉంటాయని అనుకుంటారు. అవన్నీ పొందుపరిచిన సినిమా ఇది. ‘జైసింహా’ కోసం బాలకృష్ణతో పని చేసిన కె.ఎస్‌.రవికుమార్‌కు ఏం కావాలో బాలకృష్ణ సినిమా అంటే యాక్షన్‌, ఎమోషన్‌, డైలాగ్‌లు, ఇవన్నీ ఆశిస్తారు అభిమానులు. పాత్రలో వివిధ గెటప్‌లు ఉంటాయని అనుకుంటారు. అవన్నీ పొందుపరిచిన సినిమా ఇది. ‘జైసింహా’ కోసం బాలకృష్ణతో పని చేసిన కె.ఎస్‌.రవికుమార్‌కు ఏం కావాలో తెలుసు. ఆ అంశాలతో కథను అల్లుకున్నారు. కథానాయకుడు గతం మర్చిపోవడం, అతనికి ఒక ఫ్లాష్‌ బ్యాక్‌ ఉండటం అన్నది రొటీన్‌ ఫార్ములా. ఈ సినిమా కోసం దాన్నే నమ్ముకున్నారు. ఎప్పుడైతే ఈ నేపథ్యంతో కథ సాగుతుందో సినిమాలోని సన్నివేశాలన్నీ గతంలో చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. బాలకృష్ణను జయసుధ చేరదీయడం, ఒక సీఈవోగా మార్చడం వంటి సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. సీఈవోగా బాలకృష్ణ విన్యాసాలు, బ్యాంకాక్‌ సన్నివేశాలు, సొనాల్‌ చౌహాన్‌తో డ్యూయెట్‌లు తదితర వ్యవహారాలతో ప్రథమార్ధం కథ సాఫీగానే సాగిపోతుంది. షాకింగ్‌ ఎలిమెంట్స్‌ ఏవీ ఉండవు. అబ్బుర పరిచే సన్నివేశాలు కూడా ఏవీ రావు. బాలయ్య తనదైన నటన, స్టెప్‌లతో ఫ్యాన్స్‌ను అలరించే ప్రయత్నం చేశాడు. బ్యాంకాక్‌ సన్నివేశాల్లో కామెడీ అంతగా పండలేదు. అవన్నీ సాగదీతగా అనిపిస్తాయి.

 

వేదిక రాకతో కథలో మలుపు ఉందన్న సంగతి అర్థమవుతుంది. యూపీ వ్యవహారాలు, రైతుల సమస్యతో కథనం వేగం పుంజుకుంది. ద్వితీయార్ధంలో పోలీస్‌ పాత్ర ప్రవేశిస్తుంది. ఆ పాత్రను కూడా మాస్‌ను అలరించేలా రూపొందించారు. ద్వితీయార్ధంలో రైతుల సమస్యలతో పాటు, పరువు హత్యలను ప్రస్తావించారు. ప్రథమార్ధం చూసిన ప్రేక్షకుడికి ద్వితీయార్ధంలో మరో సినిమా చూసిన భావన కలుగుతుంది. యాక్షన్‌ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. దాంతో ఫైట్‌ తర్వాత ఫైట్‌ వచ్చి పడిపోతుంటాయి. అవన్నీ అభిమానులను అలరించినా, కుటుంబ ప్రేక్షకులకు కాస్త ఇబ్బంది కలిగించేలా ఉంటాయి. అర్జున్‌ ప్రసాద్‌ ఎవరు? అతని ఫ్లాష్‌ బ్యాక్‌ ఏంటో తెలిసిన తర్వాత ఒక భారీ క్లైమాక్స్‌తో సినిమాను ముగించారు. పాత కథను కొత్తగా తీయడంలో దర్శకుడు కె.ఎస్‌. రవికుమార్‌ తన మార్కు చూపించలేకపోయారు అక్కడక్కడా బాలకృష్ణ తనదైన శైలిలో చేసిన విన్యాసాలు ఊరటను కలిగిస్తాయి.

 

బలాలు

 • బాలయ్య ఎనర్జిటిక్ నటన
 • డాన్సులు, ఫైట్స్
 • బ్యాక్ గ్రౌండ్ స్కోర్

బలహీనతలు

 • మైనస్
 • రొటీన్ కథ
 • మ్యూజిక్
 • హీరోయిన్స్
 • పబ్లిక్ ఒపీనియన్

Back to top button