టాలీవుడ్సినిమా

బాలయ్య ఫిక్స్ అయ్యాడు.. ఇక తప్పదు !


కరోనా ఉన్నా సీనియర్ హీరోలు షూట్ అంటే చాలు.. ఎందుకు రిస్క్ అనుకోకుండా మొత్తానికి సినిమా షూట్ లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. అందుకే బాలయ్య కూడా షూట్ కి రెడీ అంటున్నాడు. దర్శకనిర్మాతలు హీరోయిన్ ఇంకా సెట్ అవ్వలేదు కాబట్టి కొన్నాళ్లు ఆగుదాం అంటున్న.. నో.. షూట్ అందరి కంటే మనమే లాస్ట్ స్టార్ట్ చేస్తున్నాం.. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే వారం షూట్ చేయాల్సిందే అని ఆర్డర్ పాస్ చేసేశాడట. మొత్తంమీద బాలయ్య షూటింగ్ స్టార్ట్ చేసేదానిలో కూడా తోటి హీరోలతో పోటీ పడుతున్నాడు అన్నమాట. మరి బాలయ్య అంతే.. తాను పోటీ అనుకుంటే ఇక ఆగడు.

వచ్చేవారం షూటింగ్ కి ముహూర్తం పెట్టుకుని ఫిక్స్ అయ్యాడు కాబట్టి.. ఇక షూటింగ్ అయిపోవాల్సిందే. ఎవరు ఎన్ని చెప్పినా, ఏం జరిగినా వెనుకడుగు వేయడం బాలయ్య హిస్టరీలోనే లేదు అని బాలయ్య చాలా బలంగా నమ్ముతాడు కాబట్టి. బాలయ్య వచ్చే వారం నుండి షూట్ చేయడానికి ఇప్పటికే రెడీ అయ్యాడు. కాకపోతే షూట్ చేయాలంటే సెట్స్ రెడీ కావాలి. కానీ ఇంకా సెట్స్ వేయడమే స్టార్ట్ చేయలేదు. మరి షూట్ ఎక్కడ చేస్తారో.. రామోజీ ఫిల్మ్ సిటీలోని విలేజీ సెట్ ఆల్ రెడీ వేసి ఉందట. ఆ సెట్ లోనే దర్శకుడు బోయపాటి శ్రీను షూటింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. నిజానికి బోయపాటికి ఆ సెట్ లో షూట్ చేయడం ఇష్టం లేదట.

బాలయ్య తొందర పెడుతున్నాడు కాబట్టి.. షూటింగ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అయితే ఇప్పటికిప్పుడు షూట్ ఫిక్స్ చేస్తే.. మిగిలిన నటీనటులు షూట్ కి వస్తారని నమ్మకం లేదు. మరోవైపు ఆల్ రెడీ మేము వేరే సినిమాలకు డేట్స్ ఇచ్చేసాం ఇప్పుడే షూట్ వద్దు అంటూ కొంతమంది ఆర్టిస్ట్ లు బోయపాటిని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ బాలయ్య ఫిక్స్ అయితే ఇక బోయపాటి చేతిలో కూడా ఏమి ఉంటుంది. ఇక బాలయ్య కోసం కేరళ నుండి ఒక కొత్త హీరోయిన్ ను పట్టుకొచ్చారు. ఆమె కూడా బాలయ్య బాబు పక్కన సరిగ్గా సెట్ అవ్వట్లేదని రూమర్స్ వినిపిస్తున్నాయి.

Back to top button