టాలీవుడ్సినిమా

ట్రోలింగ్ దెబ్బకు వెనక్కి తగ్గిన బాలయ్య..!

Balakrishna
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా బోయపాటి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. బాలయ్య ఇందులో డ్యూయల్ రోల్స్ చేస్తున్నాడు. దీంతో బాలయ్య పక్కన ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉంది. అయితే హీరోయిన్ల విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ రావడం లేదు. చాలామంది హీరోయిన్లు తెరపైకి వచ్చినా చిత్రయూనిట్ మాత్రం అధికారిక ప్రకటించడం లేదు.

Also Read: ‘ఆచార్య’ సెట్లో సోనూసూద్ కు చిరుసత్కారం

బాలయ్య పక్కన ఓ కొత్త హీరోయిన్ నటిస్తుందనే గాసిప్స్ విన్పించాయి. అయితే ఆమెను ఈ మూవీ నుంచి తప్పించినట్లు ప్రచారం జరిగింది. తాజాగా బాలయ్య సరసన కోలివుడ్ స్టార్ హీరో ఆర్య సతీమణి సయేషా సైగల్ నటిస్తుందని ప్రచారం జరిగింది. ఇక రెండో హీరోయిన్ పూర్ణ నటిస్తుందని టాక్ విన్పించింది.

బాలయ్య సినిమాలో హీరోయిన్లకు పెద్దగా ప్రాముఖ్యత ఉండకపోవడంతో వీరిద్దరిని తక్కువ పారితోషికంతో తీసుకున్నారనే గుసగుసలు విన్పించాయి. బాలయ్య సరసన సయేషా నటిస్తుండటం ప్రచారం జరగడంతో సోషల్ మీడియాలో ఆయనపై పెద్దఎత్తున ట్రోలింగ్ చేశారు. కూతురు వయస్సు అమ్మాయితో రోమాన్స్ ఏంటీ విమర్శలు గుప్పించారు.

Also Read: పూరి మ్యూజింగ్స్.. అది భారతకే సొంతం అంటున్న పూరి..!

ఈ విషయం బాలయ్య దృష్టికి వెళ్లడంతో హీరోయిన్ విషయంలో ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. బోయపాటి-బాలయ్య కాంబినేషన్ కు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. ‘సింహ’.. ‘లెజండ్’ సూపర్ హిట్ల తర్వాత హట్రిక్ మూవీతో తాజా చిత్రం రానుంది. దీంతో ఈ మూవీ విషయంలో బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

హీరోయిన్ విషయంలో సోషల్ మీడియాలో తెగ విమర్శలు రావడంతో తెరపైకి మరో హాట్ పేరు వచ్చింది. బాలయ్య కు జోడీగా హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ నటించనుందనే టాక్ విన్పిస్తోంది. ఈమేరకు బోయపాటి సైతం ఆమెతో మాట్లాడి ఫైనల్ చేసినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. విమర్శలను పెద్దగా పట్టించుకోని బాలయ్య హీరోయిన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button