తెలంగాణరాజకీయాలు

బండికి బీజేపీ పగ్గాలు


తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర బీజేపీ అధిష్ఠానం ఆయన పేరును ఖరారు చేసింది. బండి సంజయ్‌ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా ప్రకటించారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ లక్ష్మణ్‌ కొనసాగిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చుతారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష స్థానం కోసం మాజీ మంత్రి డి.కె. అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆశావహులు పోటీ పడ్డారు. చివరికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పేరును ఖరారు చేశారు.

Back to top button