తెలంగాణరాజకీయాలు

ఓవైసీ చేతిలో కేసీఆర్ కు దెబ్బలే

Owaisi CM KCR తెలంగాణ ప్రభుత్వం బుధవారం నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నిబంధనల అమలుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రంజాన్ కు ముందు లాక్ డౌన్ విధిస్తే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేతిలో కేసీఆర్ దెబ్బలు తింటారని ఆసక్తికర ప్రకటన చేశారు దీంతో అందరి దృష్టి లాక్ డౌన్ అమలుపై పడింది. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. దీంతో ప్రజలు గందరగోళంలో పడిపోయారు. ఇన్నాళ్లు లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు లాక్ డౌన్ విధించడంపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కేసుల సంఖ్య తగ్గుందని ప్రకటించినా లాక్ డౌన్ వరకు వెళ్లడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.

పది రోజుల పాటు..
లాక్ డౌన్ బుధవారం (మే12) నుంచి 22 వరకు పది రోజుల పాటు కఠినమైన నిబంధనలు విధిస్తున్నట్లు సీఎం ప్రకటించారు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే మినహాయింపు ఇచ్చారు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా ప్రభుత్వం అనుకోకుండా లాక్ డౌన్ ప్రకటన చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా లాక్ డౌన్ విధించడంపై బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఎంఐఎం చీఫ్ చేతిలో సీఎంకు దెబ్బలే అని కామెంట్ చేశారు. దీంతో లాక్ డౌన్ అమలు ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ తో సామాన్య జనం పడే పాట్లు అంతా ఇంతా కాదు. ప్రభుత్వాలు తమ మటుకు లాక్ డౌన్ ప్రకటిస్తున్నా ఆచరణలో సాధ్యాసాధ్యాలపై పట్టించుకోవడం లేదు.

సీఎం కేసీఆర్ వి అన్ని అబద్ధాలే
కరోనా విషయంలో ఆంక్షల అమలులో సీఎం కేసీఆర్ చెప్పేవన్ని అబద్ధాలే. ఇప్పటి వరకు కరోనా నిర్మూలనకు కేసీఆర్ సూచించిన ఆంక్షల అమలులో ఆశించిన మేర సక్సెస్ కాలేకపోయారు. దీంతో లాక్ డౌన్ విషయంలో కూడా సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా ఏదీ జరగదని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ చెబుతున్న అబద్ధాల వల్లే కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన సాయం అందడం లేదని తేల్చారు. కరోనా కేసుల విషయంలో, మరణాల రేటులో కూడా తప్పులు లెక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. అనవసర విషయాలపై దృష్టి పెట్టే కేసీఆర్ ప్రజల అవసరాలను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.

ఒక వర్గం కోసమే..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక వర్గం కోసమే పని చేస్తున్నారు. రంజాన్ వేళ లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నా సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే పలువురు నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరమంతా రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నా పాతబస్తీలో అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ వేళ రంజాన్ పండుగ రావడంతో ఏ మేరకు స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రంజాన్ సందర్భంగా లాక్ డౌన్ విధిస్తే సీఎం క్యాంపు ఆఫీసుపై అసదుద్దీన్ బరిగెలతో దాడి చేస్తారని బండి సంజయ్ పేర్కొన్నారు. దీంతో లాక్ డౌన్ సజావుగా సాగేనా అనే దానిపై అందరు ఉత్కంఠగా ఉన్నారు.

Back to top button