క్రీడలు

బెంగళూరు బాదేసింది..పోరాడిన ఓడిన ఢిల్లీ

Bangalore big score .. Delhi target 172

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ భారీ స్కోరు సాధించింది. కోహ్లీ సహా మ్యాక్స్ వెల్ అందరూ విఫలమైన చివర్లో ఏబీ డివిలియర్స్ దంచికొట్టడంతో బెంగళూరు భారీ స్కోరు సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగుల భారీ స్కోరు సాధించింది. చివర్లో ఏబీ డివిలియర్స్ 75 పరుగులు నాటౌట్ గా నిలిచి ఫోర్లు, సిక్సర్లతో దంచికొట్టడంతో ఈ భారీ స్కోరు సాధ్యమైంది. చివరి ఓవర్లలోనే ఏబీ విధంగా సృష్టించి మూడు సిక్సులు కొట్టాడు. ఇక రజిత్31, మ్యాక్స్ వెల్ 25 రాణించారు. కెప్టెన్ కోహ్లీ 12, పడిక్కల్ 17 విఫలమయ్యారు.

30 పరుగులకే ఓపెనర్లు ఔటైన వేళ ఏబీ డివిలియర్స్ ఆదుకున్నాడు. దీంతో బెంగళూరు భారీ స్కోరు సాధ్యమైంది. చివరి ఓవర్లలో డివిలియర్స్ 23 పరుగులు రాబట్టారు.

ఢిల్లీ లక్ష్యం 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది. కడపటి వార్తలు అందేసరికి త్వరగా రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్, వన్ డౌన్ లో వచ్చిన స్మిత్ కూడా త్వరగా ఔట్ కావడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ పంత్, ఫృథ్వీ షాలు నిలకడగా ఆడుతున్నారు.

ఇన్నింగ్స్ మధ్యలో అహ్మదాబాద్ స్టేడియాన్ని గాలి దుమారం షేక్ చేసింది. పెద్ద ఎత్తున గాలి, దుమ్ము దూళి రావడంతో మ్యాచ్ ను ఆపేశారు. అయితే గాలిదుమారం తగ్గిన తర్వాత మ్యాచ్ కొనసాగింది.

తర్వాత ఢిల్లీ కెప్టెన్ పంత్, హిట్ మెయిర్ చివరివరకు పోరాడారు. చివరి ఓవరో రెండు బంతులకు రెండు సిక్సులు 12 పరుగులు చేయాల్సిన దశలో కెప్టెన్ పంత్ ఒక సిక్స్ ఒక ఫోర్ మాత్రమే కొట్టాడు. దీంతో 10 పరుగులే వచ్చాయి. బెంగళూరు కేవలం ఒక్క పరుగుతేడాతో ఢిల్లీపై గెలిచింది.

Back to top button