అత్యంత ప్రజాదరణక్రీడలుప్రత్యేకం

బంగ్లాదేశ్ దెబ్బ అదుర్స్.. ఆస్ట్రేలియా చెత్త రికార్డ్

ప్రపంచంలోనే మేటి జట్టు ఆస్ట్రేలియా.. ఇక క్రికెట్ లో పసికూన లాంటి బంగ్లాదేశ్ చేతిలో ఆపసోపాలు పడుతోంది. బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు గెలవడానికి కిందా మీద పడుతోంది. వరుసగా టీ20ల్లో ఓడిపోతోంది. ఐదు టీట్వంటీల్లో భాగంగా జరిగిన ఆఖరి టీట్వంటీలోనూ ఆస్ట్రేలియాకు దారుణ పరాభవం ఎదురైంది. ఏకంగా 5వ టీట్వంటీలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది.

గత 4వ మ్యాచ్ లో రిచర్డ్స్ సన్ వీరబాదుడుతో ఒక్క టీట్వంటీలో ఆస్ట్రేలియా గెలుపొందింది. అయితే ఇప్పటికే బంగ్లాదేశ్ వరుసగా 3 టీట్వంటీలు గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఆఖరిదైన 5వ టీట్వంటీ చివరి మ్యాచ్ లో మాత్రం ఆస్ట్రేలియా దారుణంగా విఫలమైంది.

స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హాసన్ 9 పరుగులకే 4 వికెట్లు తీసి సూపర్ బౌలింగ్ చేయడంతో అస్ట్రేలియా పేకమేడలా కూలింది. దీంతో ఐదు టీట్వంటీల సిరీస్ ను బంగ్లాదేశ్ 4-1తో సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాపై ఆ జట్టుకు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. దాంతో తాము పసికూనలం కాదని బంగ్లాదేశ్ యావత్ క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పింది.

బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓటర్లలో 8 వికెట్లకు 122 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. మహ్మద్ నైమ్ (23) టాప్ స్కోరర్. అనంతరం చేధనలో అసీస్ ను షకీబ్ అల్ హసన్ చావు దెబ్బ తీశాడు. అసీస్ ను 13.4 ఓవర్లలోనే 62 రన్స్ కే బంగ్లాదేశ్ కుప్పకూల్చి పెను సంచలనం సృష్టించింది. బంగ్లా బౌలర్ల ధాటికి 9మంది బ్యాట్స్ మెన్ సింగిల్ డిజిట్ కే ఔట్ కావడం విశేషం.

ఓ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఆస్ట్రేలియాకు ఇది అత్యల్ప స్కోర్. దీంతో బంగ్లాదేశ్ దెబ్బకు ఆస్ట్రేలియాకు దారుణ పరాభవం ఎదురైనట్టైంది.

Back to top button