విద్య / ఉద్యోగాలు

135 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. భారీ వేతనంతో..?

బ్యాంక్ నోట్ ప్రెస్ (బీఎన్‌పీ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 135 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియ‌ర్ ఆఫీస్ అసిస్టెంట్‌, జూనియ‌ర్ టెక్నీషియ‌న్, వెల్ఫేర్ ఆఫీస‌ర్‌, సూప‌ర్‌వైజ‌ర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కొరకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మే నెల 12వ తేదీన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ నెల 11వ తేదీలోపు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని దేవాస్‌ ప్రాంతంలో పని చేయాల్సి ఉంటుందని సమాచారం.

ఈ నోటిఫికేషన్ ద్వారా నోయిడాలోని ఇండియా గ‌వ‌ర్న‌మెంట్ మింట్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ సైతం జరగనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు http://bnpdewas.spmcil.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 135 ఉద్యోగ ఖాళీలలో జూనియ‌ర్ టెక్నీషియ‌న్ 113, జూనియ‌ర్ ఆఫీస్ అసిస్టెంట్‌ 15, సూప‌ర్‌వైజ‌ర్ 2, వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 1 ఉన్నాయి.

గ‌వ‌ర్న‌మెంట్ మింట్‌లో జూనియ‌ర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 3, సెక్ర‌టేరియ‌ల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 1 ఉన్నాయి. వెల్ఫేర్ ఆఫీస‌ర్, జూనియ‌ర్ అసిస్టెంట్‌, సెక్ర‌టేరియ‌ల్ అసిస్టెంట్‌ పోస్టుల‌కు డిగ్రీ, సూప‌ర్‌వైజ‌ర్ ఉద్యోగాలకు డిప్లొమా మిగిలిన ఉద్యోగాలకు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ చేసిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత‌ప‌రీక్ష‌, స్టెనోగ్ర‌ఫీ టెస్ట్‌, టైపింగ్ టెస్ట్‌ ద్వారా ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

Back to top button