విద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండా బ్యాంక్ జాబ్స్..?

Bank Of Baroda Recruitment 2021

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వేర్వేరు విభాగాల్లో ఖాళీగా ఉన్న 511 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

https://www.bankofbaroda.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాతపరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 511 ఉద్యోగ ఖాళీలలో సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్స్ ఉద్యోగ ఖాళీలు 407 ఉండగా ఈ-రిలేషన్‌షిప్‌ మేనేజర్ల ఉద్యోగ ఖాళీలు 50 ఉన్నాయి.

టెర్రిటరీ అధిపతులు ఉద్యోగ ఖాళీలు 44 ఉండగా గ్రూప్ హెడ్స్ ఉద్యోగ ఖాళీలు 6, ప్రాడక్ట్‌ హెడ్స్‌ (ఇన్వెస్ట్‌మెంట్‌, రిసెర్చ్‌) ఉద్యోగ ఖాళీ 1, ఆరేషన్స్‌ అండ్‌ టెక్నాలజీ హెడ్ ఉద్యోగ ఖాళీ 1, డిజిటల్‌ సేల్స్‌ మేనేజర్ 1, ఐటీ ఫంక్షనల్‌ అనలిస్ట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీ 1 ఉన్నాయి. 23 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 600 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Back to top button