ఆరోగ్యం/జీవనంతెలంగాణరాజకీయాలు

కరోనా-వర్షాలతో శోభ తగ్గిన బతుకమ్మ..!

Batukamma loses charm with corona-rains.!

తెలంగాణలో అతి పెద్ద పండుగ బతుకమ్మకు ఈసారి శోభ తగ్గింది. ఓవైపు కరోనా.. మరోవైపు భారీ వర్షాలతో తెలంగాణలో పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో వివిధ జిల్లాలకు చెందిన వారు ఈపాటికే తమ సొంత ఊళ్లలోకి వెళ్లి సందడి చేసేవారు. ఇక నగరంలోనూ బతుకమ్మ ప్రారంభం నుంచి వారం రోజుల పాటు సందడిగా ఉండేది. కానీ కరోనా ప్రభావంతో పండుగ వాతావరణం కనిపించడం లేదు. దసరా వస్తుందంటే ఇటు ప్రజలకు, అటు వ్యాపారాలకు ఉన్న ఊపు ఈ సంవత్సరం పూర్తిగా తగ్గిందనే చెప్పవచ్చు.

Also Read: అక్టోబర్లో ఈ వానలేంది.? కారణం ఇదట!

తెలంగాణలో కరోనా ప్రారంభం నుంచే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వేగంగా విస్తరించింది. దీంతో నగరంలో దాదాపు 70 శాతం మందికి కరోనా నిర్దారణ అయినట్లు అధికారిక లెక్కలున్నాయి. ఈ ప్రభావంతో ప్రజలు అత్యవసం అయితే తప్ప బయటికి వెళ్లడం లేదు. ఇక పండుగలపై అధికారులు సైతం అవగాహన కల్పిస్తుండడంతో ఎవరింట్లో వారే పండుగ చేసుకుంటున్నారు. బతుకమ్మ అంటేనే మహిళలంతా ఒక్కచోట చేరి చేసుకునే పండుగ. అలా చేస్తే కరోనా మరోసారి విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం మహిళలు ఈ వేడుకకు దూరంగా ఉండాలని నిర్ణయంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

భారీ వర్షాలు హైదారాబాద్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. కనీసం బయటకు వెళ్లలేని పరిస్థితి దాపురించింది. మరో నాలుగైదు రోజుల్లో బతుకమ్మ పండుగ రానుంది. ఈ నేపథ్యంలో ఈసారి తమకు పండుగ లేనట్లేనని భావిస్తున్నారు. ఓ వైపు ఆర్థిక భారం.. మరోవైపు వరదల కారణంగా కనీసం సౌకర్యాలు లేకపోవడంతో పండుగ కంటే ప్రాణాలే ముఖ్యమని భావిస్తున్నారు. అటు ఆర్టీసీ సైతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు నడిపించడంలో క్లారిటీ రాలేదు. దీంతో ఈసారి బస్సులుకు బ్రేక్‌ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎ్కడివారు అక్కడే ఉండాలని అనుకుంటున్నారు.

Also Read: బ్రేకింగ్: 6 గంటలకు ప్రజల ముందుకు మోడీ.. ఏం చెప్తారు?

మరోవైపు వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా చితికిపోయినా దసరా పండుగ నేపథ్యంలో రికవరీ చేసుకోవచ్చనుకున్నారు. ఇప్పుడు అదే సమయంలో భారీ వర్షాలతో ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని పలువురు వ్యాపారస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌ సైతం వినియోగదారులు రాక బోసిగా వెలబోతున్నాయి. ఎన్ని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించినా ఆసక్తి చూపకపోవడంతో ఈసారి తమకు ‘పండుగ’ లేనట్టేనని భావిస్తున్నారు.

Back to top button