విద్య / ఉద్యోగాలు

1679 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో..?

BECIL Manpower Recruitment 2021

బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 1679 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ నెల 20వ తేదీలోగా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా విడుదల చేసిన నోటిఫికేషన్ లో స్కిల్డ్ ఉద్యోగాలతో పాటు సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ ఉద్యోగాలు ఉన్నాయి.

ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ట్రైనింగ్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కనీసం 50 శాతం మార్కులను సాధించాల్సి ఉంటుంది. కనీస మార్కులు సాధించిన వాళ్లను కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ప్రభుత్వ ప్రాజెక్ట్ లలో నియమించడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

https://www.beciljobs.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 590 రూపాయలుగా ఉండగా మిగిలిన అభ్యర్థులకు 295 రూపాయలు పరీక్ష ఫీజుగా ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సర్టిఫికెట్లతో పాటు అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లు, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, పాన్ కార్డు, ఆధార్ కార్డులను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఎలక్ట్రికల్ ట్రేడ్, వైర్ మెన్, ఇతర విభాగాల్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు స్కిల్ల్డ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్స్ లో రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అర్హులు. ఏదైనా స్టేట్ బోర్డులో 8వ తరగతి పాసై ఎలక్ట్రికల్ విభాగంలో సంవత్సరం అనుభవం ఉన్నవాళ్లు అన్ స్కిల్డ్ మాన్ పవర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పాసై డీసీఏ, పీజీడీసీఏ కోర్సుల్లో ఇంగ్లీష్, హిందీ టైపింగ్ పై అవగాహన, అనుభవం ఉన్నవాళ్లు సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Back to top button