విద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త.. రూ.35 వేల వేతనంతో ఉద్యోగాలు..?

BEL Recruitment 2021

భారత ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన బెల్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 268 ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, జమ్మూ అండ్ కశ్మీర్, ఇతర రాష్ట్రాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. కనీసం రెండు సంవత్సరాల పాటు ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు పని చేయాల్సి ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థులను గరిష్టంగా నాలుగు సంవత్సరాల వరకు పొడిగించే అవకాశాలు అయితే ఉంటాయి. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారికి తొలి ఏడాది 35,000 రూపాయల వేతనం లభిస్తుంది. ఆ తరువాత రెండో ఏడాది నెలకు 40,000 రూపాయలు, , మూడో ఏడాది నెలకు రూ.45 వేలు, నాలుగో ఏడాది రూ. 50 వేల వేతనం లభించే అవకాశం ఉంటుంది.

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 32 సంవత్సరాల లోపు వ్యస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపులు ఉంటాయి. అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మే 5వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. https://bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు.

Back to top button