విద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త .. భారీ వేతనంతో బీఈఎల్‌ లో జాబ్స్..?

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 23 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ ఇంజినీర్‌, ట్రైనీ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మై 19వ తేదీలోపు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం పోస్టులు 23 కాగా ఇందులో ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలు 20 ఉంటే ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీలు 1, ట్రైనీ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీలు 2 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్‌లో బీఈ, బీటెక్‌, బీఎస్సీ (ఇంజినీరింగ్‌) కోర్సుల్లో ఏదో ఒకటి చేసిన వాళ్లు ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏలో ఏదో ఒకటి చేసిన వాళ్లు ప్రాజెక్ట్ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీడీఎంలో ఏదో ఒకటి ఉత్తీర్ణులైన వాళ్లు ట్రైనీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా https://www.bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం మే 19 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను మహారాష్ట్రలోని నావీ ముంబై ప్రాంతంలో ఉన్న బెల్ సంస్థ అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది.

Back to top button