ఆరోగ్యం/జీవనంలైఫ్‌స్టైల్

ఉదయం మొలకెత్తిన గింజలు తింటే కలిగే లాభాలివే..?

Sprouts

పెద్దల్లో చాలామంది ప్రతిరోజూ ఉదయం సమయంలో మొలకెత్తిన గింజలు తినమని సూచనలు చేస్తుంటారు. ఈ గింజలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. మొలకెత్తిన గింజల్లో మాంగనీస్, ఫోలేట్, విటమిన్ సి విటమిన్ కె లతో పాటు ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి అద్భుతమైన పోషకాలు ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.

Also Read: డీహైడ్రేషన్ తో బాధ పడుతున్నారా.. చెక్ పెట్టే చిట్కాలివే..?

సులభంగా జీర్ణమయ్యే మొలకెత్తిన గింజలు తినడం వల్ల శరీరం పోషకాలను సులువుగా గ్రహించే అవకాశాలు ఉంటాయి. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లకు మొలకెత్తిన గింజలు జీర్ణక్రియ ప్రక్రియను సులభంగా మెరుగుపరుస్తాయి. శరీరంలోని రసాయనిక చర్యలను మెరుగుపరచడంలో మొలకెత్తిన గింజలు ఎంతగానో తోడ్పడతాయి. గుండె సంబంధిత సమస్యలకు మొలకెత్తిన గింజలు సులభంగ చెక్ పెడతాయి.

Also Read: మాంసాహారం తిన్న తర్వాత బాదం తింటే కలిగే లాభాలివే..?

మొలకెత్తిన గింజలు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గితే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ గింజలలో ఉండే ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయపడటంతో పాటు ఇందులో ఉండే త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో మొలకెత్తిన గింజలు తోడ్పడతాయి. మొలకెత్తిన గింజల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

విటమిన్ సి వల్ల తెల్ల రక్త కణాలు శక్తివంతంగా పని చేయడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. మొలకెత్తిన గింజలు తినడం వల్ల శరీరానికి లాభమే తప్ప నష్టం లేదు. అందువల్ల పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ వీటిని తీసుకుంటి మంచిది.

Back to top button