ఆరోగ్యం/జీవనం

కొర్రలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

మనలో చాలామంది దీర్ఘాకాలిక వ్యాధుల బారిన పడటంతో పాటు ఆ వ్యాధుల వల్ల నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మన ఆహారపు అలవాట్లే అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. పాలిష్ చేసిన బియ్యం, పురుగు మందులతో పండించిన కూరగాయలు, పండ్లు తిని ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. చిరుధాన్యాలను తింటే అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

చిరుధాన్యాలలో ఒకటైన కొర్రలు శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. మధుమేహంతో బాధ పడేవాళ్లకు కొర్రలు మంచి ఆహారం అని చెప్పవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కొర్రల్లో శరీరానికి అవసరమైన మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ధైమిన్, రైబోఫ్లేవిన్, ఎక్కువమొత్తంలో పీచు పదార్థం ఉంటుంది. పిల్లలు, గర్భిణులకు కొర్రలు మంచి ఆహారం అని చెప్పవచ్చు.

కడుపునొప్పి, ఆకలి మాంద్యం, అతిసారం లాంటి సమస్యలకు కొర్రలతో సులభంగా చెక్ పెట్టవచ్చు. ఐరన్, మాంసకృత్తులు అధికంగా ఉండే కొర్రలు మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టడంలో తోడ్పడతాయి. మతిమరపు, మూర్ఛ రోగాలకు చెక్ పెట్టడంలో కొర్రలు తోడ్పడతాయి. కొర్రలతో గంజి చేసుకుని తాగితే జ్వరం తగ్గుతుందని పెద్దలు చెబుతారు. కొర్రలు ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి.

కొర్రల ద్వారా నాడీవ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపే మోరెల్ విటమిన్ లభిస్తుంది. బెల్స్ పాల్సీ, మల్టిపుల్ స్క్లెరోసిస్ సమస్యలకు కొర్రలు చెక్ పెడతాయి. కొర్రలు రోజూ తినడం వల్ల కొన్నిరకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Back to top button