కరోనా వైరస్జనరల్

ఆ రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా.. అపార్ట్‌మెంటుకు సీల్..?

Bengaluru Corona Cases

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. కరోనా కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గీ మళ్లి పెరుగుతోంది. కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ఉండగా కర్ణాటకలో కూడా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బెంగళూరులో కరోనా అలర్ట్ ప్రకటించడంతో పాటు కరోనా ఆంక్షలను విధించారు.

Also Read: స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు అలర్ట్.. కరోనాతో పొంచి ఉన్న ప్రమాదం..?

కరోనా ఆంక్షలలో భాగంగా అధికారులు ఎస్ జేఆర్ వాటర్ మార్క్ అపార్ట్ మెంట్ కు సీల్ వేశారు. గత వారం రోజుల్లో ఈ అపార్టుమెంట్ లో పది కేసులు నమోదు కావడంతో బ్రుహట్ బెంగళూరు మహాన్ గారా పాలైక్ అపార్టుమెంట్ లోని ఆరు బ్లాకులను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించడంతో పాటు అపార్ట్ మెంట్ ప్రాంగణంలో శానిటైజేషన్ పనులు కూడా జరుగుతున్నాయి. నలుగురు వైద్యులు, ఆరోగ్య బృందాలను అధికారులు అపార్ట్ మెంట్ దగ్గర నియమించారు.

Also Read: కరోనాకు కొత్త చికిత్స.. 60 శాతం తగ్గిన మరణాలు..?

ఆగ్నేయ బెంగళూరు ఉపనగరమైన బెల్లందూర్ లో ఈ అపార్టుమెంట్ ఉండగా ఈ అపార్టుమెంట్ లో మొత్తం 1,500 మంది వరకు నివశిస్తున్నారని తెలుస్తోంది. ఈ అపార్టుమెంట్ లో మొత్తం 9 బ్లాకులు ఉండగా 9 బ్లాకులలో 6 బ్లాకులకు కనెక్టివిటీ లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. మిగిలిన మూడు బ్లాకులలో ఇప్పటివరకు ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు కోసం: కరోనా వైరస్

బెంగళూరు నగరంలోని మంజుశ్రీ నర్సింగ్ కాలేజీలో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కాగా 40 మంది నుంచి శాంపిల్స్ సేకరిస్తే అందరికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. . బెంగళూరు పట్టణ ప్రాంతంలో 181 కేసులు నమోదు కాగా బెంగళరూ అర్బన్ జిల్లా పాజిటివ్ కేసులు నమోదైన వాటిలో ఫస్ట్ ప్లేస్ లో నిలవడం గమనార్హం. రాష్ట్రంలో 4,03,943 కరోనా కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి.

Back to top button