సినిమా

‘బాహుబలి’ని మించి.. ఔరా అనిపిస్తున్న ప్రభాస్ మార్కెట్

Beyond ‘Bahubali’ .. Expanded Prabhas Market

యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ రేంజ్ ఇప్పుడు ఆకాశాన్ని తాకుతోంది. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత ప్రభాస్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా మారింది. ‘బాహుబలి’ విడుదలైన ప్రతిచోట కలెక్షన్ల వర్షం కురిపించింది. ‘అమరేంధ్ర బాహుబలి’గా ప్రభాస్ నటన చూసి ప్రేక్షకులంతా ఫిదా అయి అతడికి అభిమానులుగా మారిపోయారు.

Also Read: రష్మికు నందు ఘాటు ముద్దు !

ఈ మూవీ తర్వాత వచ్చిన ‘సాహో’ సైతం ప్రభాస్ క్రేజ్ ను మరింత పెరిగింది. ప్రభాస్ యాక్షన్ కు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగులో సాహో పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయినా.. ఉత్తరాదిన మాత్రం సూపర్ హిట్ కలెక్షన్లు రాబట్టింది. దీంతో బాలీవుడ్ దర్శకులు సైతం ప్రభాస్ తో మూవీ చేసేందుకు క్యూ కడుతున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ కూడా ప్యాన్ ఇండియా మూవీగా రాబోతుంది. దాదాపు 200కోట్ల భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

నాగ్ అశ్విన్ తెరకెక్కించే సైంటిఫిక్ మూవీ కోసం దాదాపు రూ.400కోట్లు ఖర్చు చేయనున్నారట. ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకోన్ నటించనుంది. అలాగే ఓ స్పెషల్ క్యారెక్టర్లో బిగ్ బీ అమితాబ్ నటించనున్నారట. ఈ మూవీలో నటించేందుకు నిర్మాతలు వీరికి భారీగానే ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ మూవీ తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ చేయనున్నాడు. ‘రామాయణం’ ఆధారంగా దర్శకుడు ఓం రావత్ ‘ఆదిపురుష్’ మూవీని తెరకెక్కించనున్నాడు. 400కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని టీ సీరిస్ నిర్మించబోతుంది. త్రీడీ టెక్నాలజీతో ఈ మూవీ రాబోతుంది. తెలుగు, హిందీలో ఈ మూవీని తెరక్కించనున్నారు. ఆ తర్వాత ఈ మూవీని అన్ని భాషల్లో డబ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read: బోయపాటిని లైన్లో పెడుతున్న దిల్ రాజు.. కారణమేంటీ?

‘బాహుబలి’ తర్వాత అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కే మూవీగా ‘ఆదిపురుష్’ నిలుస్తుందని ఇండస్ట్రీలో టాక్ విన్పిస్తోంది. ప్రభాస్ సినిమాలకు ఇండియాతోపాటు విదేశాల్లోనూ భారీ మార్కెట్ ఉంది. దీంతో దర్శక, నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనుకడటం లేదని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ ఒక్కడిపైనే 1,500కోట్లకు పైగా సినిమా వ్యాపారం జరుగుతోంది. బాలీవుడ్ హీరోలకు సాధ్యంకానీ ఫిట్స్ ను ప్రభాస్ చేసి చూపిస్తుండటం తోటిహీరోలంతా కుళ్లుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కూడా ఔరా అనిపించేలా ఉండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Back to top button