అత్యంత ప్రజాదరణసినిమాసినిమా వార్తలు

Bheemla Nayak:గంటల్లోనే పవన్ రికార్డుల మోత

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో రానా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ గ్లింప్స్ ను విడుదల చేశారు. దీనికి ‘బీమ్లా నాయక్’ అని పేరు పెట్టి పవన్ కళ్యాణ్ లుంగీపై ఆవేశం వస్తూ ఫైట్ చేస్తున్న సీన్ ను ఫస్ట్ లుక్ గా చూపించారు.

ఫస్ట్ గ్లింప్స్ ఈ ఉదయం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హైఓల్టేజ్ యాక్షన్ లుక్ తో కనిపిస్తున్నట్టుగా టీజర్ ఉర్రూతలూగిస్తోంది. ఫస్ట్ లుక్ టీజర్ లోనే తన డైలాగ్స్ తో పవన్ అందరగొట్టాడు.

పవన్ లోని వీరావేశాన్ని చూపుతూ విలన్లను చితక్కొడుతున్న ఫస్ట్ గ్లింప్స్ అభిమానులకు బాగా నచ్చేసింది. ఈ గ్లింప్స్ తో పాత రికార్డులను పవన్ చెరిపేశారు. ఇప్పటివరకు యూట్యూబ్ లో విడుదలైన టాలీవుడ్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లలో ఏది కూడా ఈ స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు.

విడుదలైన నాలుగు గంటల్లోనే అత్యంత వేగంగా 5,00,000 యూట్యూబ్ లైక్స్ అందుకున్న ఫస్ట్ గ్లింప్స్ గా బీమ్లా నాయక్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో కూడా ఈ స్థాయిలో రికార్డులు సృష్టించలేదు. అది కేవలం పవన్ కళ్యాణ్ స్టామినాకే సొంతమైంది. ప్రస్తుతం బీమ్లా నాయక్ గ్లింప్స్ యూట్యూబ్ లో టాప్ 1 ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

త్రివిక్రమ్ మాటలు అందిస్తున్న ఈ మూవీకి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నాగవంశీ నిర్మాత. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ గ్లింప్స్ తోనే పవన్ మేనియా మొదలైందని చెప్పొచ్చు.

Back to top button