ఆంధ్రప్రదేశ్పండుగ వైభవంప్రత్యేకం

భోగి ప్రత్యేకం: చిన్న పిల్లలకు భోగి పళ్ళను ఎందుకు పోస్తారో తెలుసా..?

 

Bhogi History

తెలుగువారి పండుగలలో సంక్రాంతి ముఖ్యమైన పండుగ అని చెప్పవచ్చు. సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి పండుగ నుంచి మూడు రోజులపాటు ఎంతో వైభవంగా జరుపుకుంటారు.భోగి “భోగ్” అనే సంస్కృత పదం నుంచి పుట్టిందని చెబుతారు. భోగం అంటే శుభం అని అర్థం. ఈ భోగి పండుగ రోజు గోదాదేవి శ్రీ రంగనాథ స్వామిలో లీనమైన రోజని చెబుతారు.మరొక కథనం ఏమిటంటే పూర్వం మహావిష్ణువు వామనావతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు. అయితే పాతాళంలో కూడా అతని రాజుగా ఉండమని, ప్రతి సంవత్సరం ఈరోజు భూమి పైకి వచ్చే ప్రజల క్షేమం తెలుసుకోవాలని తెలియజేయడంతో బలిచక్రవర్తి రాకను స్వాగతిస్తూ భోగి మంటలు వేస్తారు. అలాగే మన ఇంట్లో చిన్న పిల్లలపై ఈ పండుగ రోజు భోగిపళ్ళు పోయడం ప్రత్యేకత. అయితే చిన్న పిల్లలపై భోగి పళ్ళు ఎందుకు పోస్తారో ఇక్కడ తెలుసుకుందాం..

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

భోగి పండుగ రోజు మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు భోగిపళ్లు పోస్తారనే సంగతి మనకు తెలిసిందే. ఇలా భోగి పళ్ళు చిన్నపిల్లలపై పోయడానికి కూడా ఒక కారణం ఉంది. పురాణాల ప్రకారం రేగు పళ్ళు చెట్టును బదరీ వృక్షం అని కూడా పిలుస్తారు. ఈ రేగు పండ్లను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి ప్రతిరూపంగా భావిస్తారు. అంతే కాకుండా రేగుపళ్లు అంటే సూర్యునికి కూడా ఎంతో ఇష్టమైనవి. ఈ విధంగా భోగి పండుగ రోజు రేగు పళ్లను పిల్లలపై పోవడం వల్ల ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

భోగి పండుగ రోజు ఉదయం పిల్లలకు స్నానాలు చేయించి కొత్తబట్టలు వేసి వారిని తూర్పు వైపుకు కూర్చోబెట్టి వారి తలపై రేగుపళ్ళు, చిల్లర నాణేలను కలిపి వాటిని పోస్తారు. అనంతరం పిల్లలకు హారతి ఇవ్వడం ద్వారా వారిపై పడిన దిష్టి తొలగిపోతుందని భావిస్తారు. అంతేకాకుండా పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది. బాహ్య నేత్రాలకు కనిపించని బ్రహ్మరంధ్రం తలపై భాగంలో ఉంటుంది. ఈ భోగి పళ్ళను తలపై పోయడం ద్వారా అవి బ్రహ్మ రంధ్రాన్ని ప్రేరేపిస్తాయని, తద్వారా పిల్లల బుద్ధి వికసిస్తుందని నమ్ముతారు. అందుకోసమే భోగి రోజు పిల్లల తలపై భోగిపళ్లు పోయడం ఒక ఆచారంలో భాగమైంది.

Back to top button