టాలీవుడ్సినిమా

Bigg Boss 4.. అమెరికా అల్లుడిపై అత్త మోజు..!

వినోదాన్నిపంచిన చీపురు.. విగ్ యాడ్స్

bigboss 4 participantsతెలుగు రియల్టీ షోలలో నెంబర్ వన్ గా కొనసాగుతున్న బిగ్ బాస్ గత వారం క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం రెండోవారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారంలో నామినేషన్ ప్రక్రియ, ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయ్యాయి. తొలివారంలో బిగ్ బాస్-4 కంటెస్టులు బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించారు. బిగ్ బాస్-4 తొలి ఎలిమినేటర్ గా దర్శకుడు సూర్యకిరణ్ బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికొచ్చాడు. మొదటివారం సాదాసీదాగా కన్పించిన బిగ్ బాస్-4 సీజన్ క్రమంగా ఆడియన్స్ ను ఆకట్టుకునే కార్యక్రమాలు చేస్తున్నారు.

Also Read: ‘సర్కారు వారి పాట’లో బాలీవుడ్‌ స్టార్స్‌

బిగ్ బాస్-4 రెండోవారంలో క్రమంగా ఎంటటైన్మెంట్ డోస్ పెరుగుతూపోతుంది. బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభం నుంచి షో పై మిక్సడ్ టాక్ వస్తుండటంతో నిర్వహాకులు ఆడియన్స్ ను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ కంటస్టులకు వినోదాన్ని పంచే టాస్కులను ఇస్తున్నాడు. ఇక కంటెస్టుల సైతం బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టకునేలా ఫర్మామెన్స్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ మంగళవారం కంటెస్టులకు ‘అత్తా.. అల్లుడు-అమెరికా మోజు’ అనే టాస్కును ఇచ్చాడు. ఈ టాస్కులో బిగ్ బాసులోని కంటెస్టులందరూ పాల్గొని ఆడియన్స్ కు వినోదాన్ని పంచారు.

ఈ టాస్క్‌లో గయ్యాళి అత్తగా కరాటే కల్యాణి.. ఆమె కూతురుగా దివి.. అమెరికా అల్లుడిగా అఖిల్.. కల్యాణి కోడలుగా జోర్దార్ సుజాత.. మతిమరుపు గుమస్తాగా కుమార్ సాయి.. పని మనిషిగా దేవి నాగవల్లి నటించారు. అత్తగా కరాటే కల్యాణి.. కూతురుగా దివి అదరగొట్టారు. మతిమరుపు గుమస్తాగా కుమార్ సాయి అలరించగా మిగతా వారంతా వారివారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ సీరియల్స్ మధ్యలో మిగిలిన కంటెస్టులు యాడ్స్ చేసి అలరించారు. చీపురు.. విగ్ యాడ్స్ వినోదాన్ని పంచాయి.

Also Read: భారీ ప్లాప్ డైరెక్టర్ కి మెగాస్టార్ ఛాన్స్.. కారణం ?

ఇక ఈ సీరియల్ ప్రారంభానికి ముందే దెత్తడి హారిక హాట్ ఫార్మమెన్స్ తో బిగ్ బాస్ హౌజ్ ను హీటెక్కించింది. దెత్తడి హారిక డాన్స్, చిన్నపాటి స్కిట్స్ చేసి కంటెస్టులతోపాటు బుల్లితెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఆమెతోపాటు బిగ్ బాస్ హౌజ్ లో కల్యాణి.. అమ్మ రాజశేఖర్ కామెడీ.. మొనాల్-అఖిల్-అభిజిత్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఎంటటైన్ చేస్తోంది. పెరిగింది. రానున్న రోజుల్లో బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచడం ఖాయంగా కన్పిస్తోంది.

Back to top button