అత్యంత ప్రజాదరణవైరల్సినిమా

బిగ్ బాస్-4: గంగవ్వ నిజమైన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Gangavva Remuneration

తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. తన పంథాను కొనసాగిస్తూ కరోనా టైంలోనూ బిగ్ బాస్-4ను కొనసాగిస్తోంది. ప్రసుత్తం బిగ్ బాస్ 11వ వారానికి చేరుకుంది. బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంటుండటంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. ఈ షోలో 65ఏళ్ళ గంగవ్వ పాల్గొని అందరినీ షాక్ కు గురిచేసిన సంగతి తెల్సిందే.

Also Read: బాలీవుడ్ పై ‘బన్ని’ కన్ను.. ప్లాన్ అదుర్స్?

గత సీజన్లలో కంటెస్టెంట్లంతా యువతీయువకులు కాగా ఈ సీజన్లో మాత్రం యూత్ తోపాటు గంగవ్వ పాల్గొని సందడి చేసింది. ఆమె ఉన్నంత వరకు బిగ్ బాస్ లోనే ఆమెనే హైలెట్ గా నిలిచింది. ఈసారి విజేత ఆమె అనేలా ప్రచారం జరిగింది. అయితే అనుకోని విధంగా గంగవ్వ అనారోగ్యం బారినపడి హౌస్ నుంచి వెళ్లిపోయింది.

బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక గంగవ్వ యథావిధిగా తన పనులు చేసుకుంటోంది. ఇక పలు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈక్రమంలోనే ఆమె బిగ్ బాస్ లోని కొన్ని సిక్రెట్స్ రిలీవ్ చేసింది. అంతేకాకుండా బిగ్ బాస్ నుంచి వారానికి తనకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారనే విషయాలను చెప్పింది.

Also Read: బాలయ్య ఫిక్స్ అయ్యాడు.. ఇక తప్పదు !

బిగ్ బాస్-4 సీజన్లలో ఆమె 20 రోజులపాటు ఉంది. ఈ క్రమంలో ఆమెకు వారానికి 2లక్షల రెమ్యూనరేషన్ బిగ్ బాస్ నిర్వాహకులు ఇచ్చినట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. ఇక బిగ్ బాస్ లో అఖిల్-మొనాల్ మధ్య నడిచే లవ్ ట్రాక్ అంత ఉట్టిదేనని తేల్చిచెప్పింది. అయితే బిగ్ బాస్ నుంచి వెళ్లిపోతున్న సమయంలో హోస్ట్ నాగార్జున ఆమెకు ఇళ్లు కట్టిస్తానని మాట ఇచ్చాడు. దీంతో ఆమె ఇంటికల నెరవడం ఖాయంగా కన్పిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button