ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

డీకే అరుణ, పురంధేశ్వరికి అందలం.. బీజేపీ సంచలన నిర్ణయాలు

Daggubati Purandeswari  dk aruna

దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పలుచోట్ల విజయం సాధించింది. ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో   బీజేపీ 124 స్థానాల్లో  విజయం సాధించింది. అలాగే మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోని దుబ్బాక తదితర ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ జెండా రెపరెపలాడింది. దీంతో మిగతా రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ అధిష్టానం  ప్రణాళికలను రచిస్తోంది. ఈమేరకు కొన్ని రాష్ట్రాల్లో ఇన్ చార్జిలను    మార్చేసింది.

Also Read: ఈ కార్డు ఉన్నవాళ్లకు శుభవార్త.. 50 శాతానికి పైగా డిస్కౌంట్..?

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  పలు రాష్ట్రాలకు ఇన్ చార్జీలు, సహ ఇన్ చార్జీలను నియమించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్న సునీల్ దియోధర్ ను ఆ పార్టీ బాధ్యతల నుంచి తప్పించింది.  ఆయన ప్లేసులో మురళీధరన్ కు బాధ్యతలు అప్పగించారు. సునీల్ దియోధర్ ను  సహ ఇన్ చార్జిగా నియమించారు. అలాగే తెలంగాణ ఇన్ చార్జిగా తరుణ్ ఛుగాకు బాధ్యతలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ సహ ఇన్ చార్జిగా సత్యకుమార్ కు అవకాశం ఇచ్చారు.

ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన ఢీకే అరుణకు కర్టాటక సహ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. పొంగులేటి సుధాకర్ రెడ్డిని తమిళనాడు సహ ఇన్ చార్జిగా నియమించారు. ఛత్తీస్ గఢ్, ఒడిశా ఇన్ చార్జిగా దగ్గుబాటి పురంధేశ్వరిని, మధ్యప్రదేశ్ ఇన్ చార్జిగా మురళీధర్ రావును నియమించారు.

Also Read: ఏపీలో కొత్త జిల్లాలు 32? నివేదికలోని అంశాలివీ!

ఇప్పటికే వివిధ పదవుల్లో ఉన్న తెలుగువారికి  బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రాధాన్యత ఇచ్చారు. త్వరలో తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే దుబ్బాకలో బీజేపీ గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులు ఉత్సాహంతో ఉన్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్  ఎన్నికల్లోనూ పాగా వేయడానికి బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో కొత్త ఇన్ చార్జీలను నియమిస్తే పార్టీకి బలం చేకూరే అవకాశం ఉన్నందున ఈ మార్పులు చేసినట్లు సమాచారం.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Back to top button