ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

ఏపీలో పార్టీ పటిష్టతపై బీజేపీ ఫోకస్

BJP focus on party strengthening in AP?

AP BJP trying To strength the party

ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పటిష్టత కోసం బీజేపీ దృష్టి సారించింది. రాష్ట్రంలో బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టపరచాలని యోచిస్తోంది. ఏపీ అధికార, ప్రతిపక్షాలకు ధీటుగా ఎదగాలని ప్లాన్ చేస్తోంది. బీజేపీ జాతీయ నాయుకులు ఏపీలో పర్యటిస్తూ పార్టీ పటిష్టత గురించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తున్నారు.

ఏపీ బీజేపీలోని ప్రతి ముఖ్య కార్యకర్త తప్పనిసరిగా పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ పతిష్టతపై దృష్టి సారించి, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని బీజేపీ జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ హితవుపలికారు. శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో జరిగిన బీజేపీ కోస్తా ఆంధ్ర జోన్ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని ఆయన ప్రసంగించారు.

ప్రతి 5 పోలింగ్ కేంద్రాలను పార్టీ పరంగా శక్తి కేంద్రంగా పనిచేస్తున్న తరుణంలో మండల స్థాయి ముఖ్య కార్యకర్తలు ఆ శక్తి కేంద్రాలకు బాధ్యులుగా ఉండాలని, తద్వారా మండల స్థాయిలో పార్టీ పతిష్టానికి కృషి చేయాలని కోరారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటాలు చేయవలసిన అవసరాన్ని,ముఖ్య కార్యకర్తలకు వివరిస్తూ, మండల, జిల్లా స్థాయిలో ఉద్యమాలు ఏ విధంగా నిర్వహించాలి అనే అంశాలు ప్రస్తుతించారు.

పార్టీలోకి జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో తటస్తులను, వివిధ వర్గాలకు చెందిన ముఖ్యులు, ప్రజాజీవితంలో ఉన్న వాళ్ళని పార్టీలో ఆహ్వానించాలని, తద్వారా పార్టీ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పోలింగ్ బూత్ కమిటీల ద్వారా ఇంటింటికీ చేర్చాలని, ఇందుకు జిల్లా, మండల కమిటీలు బాధ్యత వహించాలని అన్నారు.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పటిష్టం చేయడానికి ప్రతి ముఖ్య కార్యకర్త తన పోలింగ్ బూత్ & మండల/ డివిజన్ కమిటీలను మరింత శక్తిగా తయారుచేయాలని, ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటాలు సాగించాలని కోరారు. ఇటీవల రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు, తాను చేసిన దేవాలయ దర్శన కార్యక్రమం,ఇతర పర్యటన వివరాలు, ప్రొద్దుటూరు పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్రహ నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన ధర్నా, కార్యక్రమం ఇతర అంశాలను వివరించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ శ్రీ వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వేటుకూరి సూర్యనారాయణ రాజు, సంఘటనా ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ జీ తదితరులు పాల్గొన్నారు.

Back to top button