తెలంగాణరాజకీయాలు

బీజేపీ జోష్.. టీఆర్ఎస్ సైలెన్స్..!

సీఎం కేసీఆర్ పై దూకుడుగా వెళుతున్న బీజేపీ.. తిప్పికొట్టలేకపోతున్న టీఆర్ఎస్..!

KCR
తెలంగాణలో రాజకీయం టీఆర్ఎస్.. బీజేపీల చుట్టూనే తిరుగుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీకి కమలదళం గట్టి షాక్ ఇవ్వడంతో అందరిచూపు బీజేపీ వైపు పడింది.

Also Read: కేసీఆర్, జగన్ ఢిల్లీ టూర్స్: ఏపీ, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్జిస్ ల బదిలీలు?

దుబ్బాకలో అధికార పార్టీని చావుదెబ్బ కొట్టిన బీజేపీ.. గ్రేటర్లోనూ అదే ట్రెండ్ ను కంటిన్యూ చేసింది. దీంతో సీఎం కేసీఆర్ బీజేపీపై కన్నెర్ర చేసిన కేంద్రంపై పోరుకు సిద్ధమయ్యారు.

డిసెంబర్ 8న రైతులు ఇచ్చిన భారత్ బంద్ కు మద్దతు ప్రకటించి ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. అయితే ఉన్నట్టుండి సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రులు అమిత్ షా తదితరులు భేటి అయి తిరిగొచ్చారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేసీఆర్ రైతు దీక్షలకు సంఘీభావం ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ కేవలం కేంద్రంలోని పెద్దలు కలుసుకొని తిరుగుముఖం పట్టడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఢిల్లీ వెళ్లారు. కేంద్రంలోని పెద్దలు కలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ టూర్ కేవలం ప్రజల దృష్టిని మరల్చేందుకేనని విమర్శించారు.

Also Read: ఓరుగల్లులో ‘బండి’ దూసుకెళ్లనుందా?

కేసీఆర్ బీజేపీ నేతల వద్ద వంగివంగి దండాలు పెట్టిన వదిలేదని.. కేసీఆర్ జైలు వెళ్లడం ఖాయమని సంచలన కామెంట్స్ చేశారు. ఢిల్లీలో బండి సంజయ్ కేసీఆర్ పై ఫైర్ అయితే రాష్ట్రంలో ఆ బాధ్యతను డీకే అరుణ తీసుకున్నారు.

ఈ ఇద్దరు నేతలు టీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ నేతల వీటిని తిప్పికొట్టలేకపోతున్నారు. సీఎం ఆదేశాల మేరకు టీఆర్ఎస్ నేతలు బీజేపీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని టాక్ విన్పిస్తోంది.

సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి తిరిగొచ్చాక టీఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా బీజేపీపై దూకుడుగా వెళ్లొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో నేతలంతా సైలంట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

బీజేపీ నేతలు ఓ వైపు టీఆర్ఎస్ నేతలపై రెచ్చిపోతుంటే.. వాటిని తిప్పికొట్టకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్ త్వరలోనే బీజేపీపై వ్యూహాన్ని ఖరారు చేస్తారనే టాక్ విన్పిస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Back to top button