ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్

పుష్కరాల్లో పుణ్యస్నానాలకు అనుమతి ఇవ్వాలని ఆందోళన

bjp, vhp aligation at tungabadra pushkara ghat.

తుంగభద్ర పుష్కరాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కర్నూరు వద్ద కొందరు భక్తులు పుణ్యస్నానం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఈరోజు బీజేపీ, వీహెచ్ పీ ఆధ్వర్యంలో తుంగభద్రలో పుణ్యస్నానాలకు అనుమతించాలని ఆందోళన నిర్వహించారు. తెలంగాణలో స్నానాలకు అనుమతించినప్పడు, ఇక్కడ ఎందుకు అనుమతి లేదన్నారు. అలాగే కర్నూల్ లోని సంకల్ బాగ్ ఘాట్ వద్ద బీజేపీ రాష్ట్ర నేత హరీశ్ బాబు ఇతర బీజేపీ నేతలు తుంగభద్ర నదిలోకి దిగి ఆందోళన చేశారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేశారు.

Back to top button