అత్యంత ప్రజాదరణజాతీయంరాజకీయాలు

బీజేపీ కొత్త కార్యవర్గం: పాత కాపులకు బై.. కొత్త నేతలకు జై

*డీకే అరుణ, పురంధేశ్వరి, లక్ష్మణ్ లకు పెద్దపీట.. కన్నా లక్ష్మీనారాయణకు షాక్


ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ మంచిపట్టు ఉంది. అయితే దక్షిణాది ఒక కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటివరకు విజయం సాధించిన దాఖలాలు లేవు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో బలపడేందుకు యత్నిస్తోంది. అందుకనుగుణంగా పావులు కదుపు ముందుకెళుతోంది.

Also Read: బండి సంజయ్ కు తీవ్ర అస్వస్థత.. సడన్ గా ఏమైంది?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు బీజేపీకి కలిసొస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు కనుమరుగైపోతుంది. ఈ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తోంది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నయం అంటూ దూసుకెళుతోంది. ఇక ఏపీలోనూ సీఎం జగన్ దాటికి టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి కన్పిస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని ఏపీ బీజేపీ నేతలు చక్కగా వినియోగించుకుంటున్నారు. ఏపీలో ఒక్క సీటు కూడా లేకుండానే బీజేపీ రాజకీయాలను హిటెక్కిస్తుండటం గమనార్హం.

తెలంగాణ, ఏపీలోనూ బీజేపీ అధిష్టానం కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోంది. తెలంగాణలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. అదేవిధంగా ఏపీలో సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పగించింది. వీరిద్దరు పార్టీ నాయకత్వాన్ని చేతుల్లోకి తీసుకున్నాక ఇరు రాష్ట్రాల్లోని బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. తెలంగాణలోనూ, ఏపీలో బీజేపీ ప్రజా సమస్యలపై గళంవిప్పుతూ దూసుకెళుతున్నాయి.

ఇటీవల ఏపీ, తెలంగాణలో బీజేపీ అధ్యక్షులు కొత్త కమిటీలను ప్రకటించారు. తగిన కార్యచరణను రూపొందించుకొని ముందుకెళుతున్నాయి. అయితే ఈ కమిటీలో సీనియర్ నాయకులు చోటు దక్కకపోవడంతో వీరిని అధిష్టానం పక్కకు పెట్టిందనే వార్తలు వచ్చాయి. అయితే వారందరినీ అంచనాలను తారుమారు చేస్తూ బీజేపీ అధిష్టానం జాతీయ కమిటీలో చోటు కల్పించింది. తెలంగాణ నుంచి డీకే అరుణ, ఏపీ నుంచి పురంధరేశ్వరీలకు జాతీయ కమిటీలో కీలక పదవులను కట్టబెట్టింది.

Also Read: ఏపీలో రేషన్ కార్డుల జారీ.. సీన్ రివర్స్ అయిందా?

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఆశించిన డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన లక్ష్మణ్ కు బీజేపీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్ష పదవీ లభించింది. ఏపీ నుంచి మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవీ దక్కింది. సత్యకుమార్‌కు జాతీయ కార్యదర్శుల జాబితాలో చోటు దక్కింది.ఇక ఏపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కూడా బీజేపీ అధిష్టానం పట్టించుకోకపోవడం ఆసక్తికర పరిణామంగా భావిస్తున్నారు.

ఈ జాబితాలో ఆశ్చర్యకరంగా రాంమాంధవ్, మురళీధర్ రావులకు పేర్లు లేకపోవడం గమనార్హం.  కొద్దిరోజులుగా వీరిని కేంద్ర క్యాబినెట్లో తీసుకుంటారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారిని పక్కన పెట్టారా? లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఏదిఏమైనా బీజేపీ పాత కాపులను పక్కన పెట్టి కొత్త నేతలకు పెద్దపీఠ వేయడం చర్చనీయాంశంగా మారింది.

Back to top button