ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

బొబ్బిలి రాజవంశం సైలెంట్ దేనికి సంకేతం?


బొబ్బిలి రాజవంశం గురించి చరిత్రలో గొప్పగొప్ప కథలున్నాయి. బొబ్బిలి గడ్డపై శత్రువులు కాలిపెడితే పోరాడి మట్టుపెట్టిన చర్రిత ఆ రాజవంశీయులది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు రాజ్యాలు, రాజవంశాలు అనేవిపోయి ప్రజాస్వామ్య పాలన నడుస్తోంది. అయితే నాటి రాజకుటుంబాలకు చెందిన వారసులు మాత్రం చరిత్రకు సాక్ష్యాలుగా ఉంటున్నారు. మద్రాసు ప్రెసిడెన్సీ పాలన నుంచి రాజ కుటుంబాలకు చెందిన వ్యక్తులు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులుగా పదవులు దక్కించుకొని తమ ఇలాఖాలో చక్రం తిప్పడం అలవాటు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం టీడీపీలో ఉన్న బొబ్బిలి రాజులు సైలంట్ అవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Also Read: చినబాబు ‘సైకిల్ యాత్ర’ సాహాస యాత్రగా మారనుందా?

ఈతరంలో బొబ్బిలి వంశానికి చెందిన వారిలో బేబినాయన, సుజయ కృష్ణ రంగారావు ఎమ్మెల్యేలుగా పని చేశారు. వీరు కాంగ్రెస్, వైసీపీ నుంచి ఎన్నికల్లో గెలిచి శాసనసభలోకి అడుగుపెట్టారు.రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరు టీడీపీలో చేరగా సుజయ కృష్ణ రంగారావుకి మంత్రి పదవీ దక్కింది. టీడీపీ అధికారంలో మంత్రిగా బొబ్బిలిలో సుజయ కృష్ణరంగారావు చక్రం తిప్పారు. అయితే 2019 ఎన్నికల్లో బొబ్బిలి రాజ కుటుంబం ఓటమి పాలవడంతో టీడీపీకి అంటిముట్టనట్లు ఉంటారనే ప్రచారం జరుగుతోంది.

టీడీపీకి అండగా ఉండి జిల్లాలో పార్టీని బలోపేతానికి బొబ్బిలి రాజులు కృషి చేస్తారని చంద్రబాబు ఏరికోరి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. అయితే కిందటి ఎన్నికల్లో ఆ కుటుంబం ఓటమి పాలవడమే కాకుండా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ ఓటమి తర్వాత వీరు ఊరికి దూరంగా ఉంటున్నారని ఏదైనా అత్యవసరమైతే బొబ్బిలికి వచ్చిపోతున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన బొబ్బిలి కుటుంబం ఇప్పుడు సైలంట్ అవ్వడంపై టీడీపీ శ్రేణులు మండిపడిపోతున్నాయి.

ప్రస్తుతం బొబ్బిలిలో టీడీపీ బాధ్యతలను బేబి నాయన చూస్తున్నారు. ఇటీవల విజయనగరం పూసపాటి రాజకుటుంబం రగడ, మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారాల్లోనూ అశోక్‌ గజపతిరాజుకు ఆయన అండగా నిలబడలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, టీడీపీ నేతలను ప్రభుత్వం అరెస్ట్‌ చేస్తున్నా కనీసం స్పందించ లేదని గుర్తుచేసుకుంటున్నారు. కనీసం బొబ్బిలిలోని కార్యకర్తల యోగాక్షేమాలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.

Also Read: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదం..!

అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల్లో ఎవరైనా గట్టిగ మాట్లాడితే వారిని అరెస్టులు చేపిస్తుండటంతో బొబ్బిలి కుటుంబం కూడా సైలంట్ అయిందనే ప్రచారం జరుగుతోంది. ఎలాగూ పార్టీ అధికారంలో లేదు కనుక టీడీపీకి అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చేసిన రాజ కుటుంబీకులు ఇప్పుడు సైలంట్ అవడంపై విమర్శలు వ్యక్తవుతున్నాయి. అధికారం ఉంటేనే రాజవంశానికి చెందినవారు గర్జిస్తారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

పవర్ లేకపోతే ఎంతటి వారైనా సైలంట్ అవ్వాల్సిందేనని బొబ్బిలి రాజకుటుంబీకులు నిరూపించారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే బొబ్బిలి రాజులు ఎప్పుడు మౌనం వీడుతారనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

Tags
Show More
Back to top button
Close
Close