బాలీవుడ్సినిమా

హాట్ బ్యూటీ లేట్ వయసులో రెండో పెళ్లి !

Dia Mirza marriage
సీనియర్ హీరోయిన్ దియా మీర్జా నేడు మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది. ముంబైలో ఆమె పెళ్లి వేడుక ఘనంగా జరుగుతుంది. ముంబైకి చెందిన వైభవ్ రేఖి అనే వ్యాపారవేత్తని ఆమె రెండో పెళ్లి చేసుకుంటోంది. ఇప్పటికే ఒకసారి పెళ్లి చేసుకుని మొదటి భర్తతో విడిపోయినా ఈ బ్యూటీకి ప్రస్తుతం 39 ఏళ్ళు, అయినా దియా మాత్రం, వైభవ్ తో గత కొంతకాలంగా ఘాడంగా రిలేషన్ షిప్ లో ఉందట. అతనితో తన జీవితం చాల బాగుందని, అందుకే అతన్ని పెళ్ళి చేసుకోబోతున్నానని దియా చెప్పుకొచ్చింది.

Also Read: రకుల్ తరువాత ప్రణీతను పట్టుకున్నాడు !

ఇంతకీ ఈ దియా అంటే తెలుగువారికి పెద్దగా పరిచయం లేదు గానీ, ఈమెది మన హైదరాబాదే, ఇక్కడే పుట్టి పెరిగింది, పైగా దియా మీర్జా ఇంతకుముందు సాహిల్ సంఘా అనే అతన్ని పెళ్లాడింది కూడా ఇక్కడే. దాదాపు 11 ఏళ్ళు మొదటి భర్తతో కలిసి ఉంది. కాకపోతే రెండేళ్ల క్రితం అమ్మడు అతనితో విడిపోయింది. ఇక ఆమె కాబోయే భర్తకి కూడా ఇది రెండో పెళ్లినే. ఐతే, వైభవ్ ఆమె కన్నా నాలుగేళ్లు చిన్నవాడు కావడం ఇక్కడ మరో విశేషం.

Also Read: దాన్ని కూడా పబ్లిసిటీ చేసుకుంటుందట !

ఇక దియా ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ సీనియర్ బ్యూటీ తెలుగు సినిమాలో కూడా నటిస్తోంది. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం… నాగార్జున హీరోగా రూపొందుతోన్న ‘వైల్డ్ డాగ్’. ఇది త్వరలోనే రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమా గానీ హిట్ అయితే, తెలుగు సీనియర్ హీరోలకు దియా రూపంలో హీరోయిన్ గా మంచి ఆప్షన్ దొరికినట్టే.

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్

Back to top button