సినిమా

కొత్తలొల్లి షూరు.. బాయ్‌కాట్ లక్ష్మీబాంబ్.. ఎందుకంటే?

Boycott Lakshmi bomb .. because?

బాలీవుడ్లో కొత్తలొల్లి షూరు అయింది. సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీ అబాసుపాలైంది. ఈ కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో సెలబ్రెటీల చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు బడా స్టార్లు ఇరుక్కున్నారు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ బాయ్‌కాట్ అంటూ నెటిజన్లు పెద్దఎత్తున ట్రోల్  చేశారు.

Also Read: ‘బిగ్ బాస్’ హోస్ట్ నాగార్జున ఎగ్జిట్.. రోజా ఇన్?

తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మీబాంబ్’ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈ సినిమాను బహిష్కరించాలంటూ నెటిజన్లు పెద్దఎత్తున #బాయ్‌కాట్ లక్ష్మీబాంబ్ హ్యాష్ ట్యాగును సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమా బహిష్కరణకు నెటిజన్లు చెబుతున్న కారణాలు చూస్తే మాత్రం ప్రతీఒక్కరూ అవాక్కవాల్సిందే..!

ఈ మూవీకి లక్ష్మీబాంబ్ అనే టైటిల్ పెట్టడం ద్వారా లక్ష్మీదేవిని చిత్రబృందం అవమానిస్తుందని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇందులో హీరో ముస్లిం అబ్బాయికాగా.. హీరోయిన్ హిందూ అమ్మాయిగా చూపించారు. వీరిమధ్య ప్రేమను చూపించి లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నారని మరికొందరు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇక్కడ హీరోయిన్‌‌ను ముస్లింగా, హీరోను హిందువుగా చూపించే సాహసం చేయగలరా అంటూ హిందుత్వవాదులు ప్రశ్నిస్తున్నారు.

దీనికితోడు అక్షయ్ కుమార్ భారతీయ పౌరుడే కాదని.. అతను కెనడియన్ అని అతడి మూలాలను ప్రశ్నిస్తున్నారు. గతంలో అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా పాకిస్థాన్ అమ్మాయి మలాలాను ఇంటర్వ్యూ చేయడాన్ని ఆక్షేపిస్తున్నారు. అక్షయ్ కుమార్ సైతం గతంలో ‘ఓ మై గాడ్’ ప్రమోషన్లలో భాగంగా విగ్రహాల మీద పాలు పోసి వృథా చేయద్దని కామెంట్ చేశాడు. ఈ విషయాలన్నింటిని ‘లక్ష్మీబాంబ్’ సినిమాకు ముడిపెట్టి బాయ్‌కాట్ లక్ష్మీబాంబ్ ఉద్యమాన్ని ఓవర్గం సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది.

Also Read: దండయాత్రకు సిద్ధమైన టాలీవుడ్ టాప్ హీరోలు.!

దీంతో బాయ్‌కాట్ లక్ష్మీబాంబ్ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నెటిజన్ల ట్రోలింగ్ దెబ్బకు భయపడి ‘లక్ష్మీబాంబ్’ చిత్రం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కు లైక్స్.. డిస్ లైక్స్.. కామెంట్ బాక్స్ డిసబుల్ చేసిన సంగతి తెల్సిందే.. అయినప్పటికీ ఈ చిత్రం ఇలా వివాదాల్లో చిక్కుకోవడం వెనుక ఎవరు ఉన్నారు? అనే చర్చ జరుగుతోంది.

సినిమా ప్రమోషన్లలో భాగంగానే చిత్రబృందమే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుందా? లేదా నెటిజన్లే స్వచ్చంధంగా బాయ్‌కాట్ లక్ష్మీబాంబ్ కు పిలుపునిస్తున్నారా? అనేది మాత్రం తేలాల్సి ఉంది. కాగా ఈ మూవీ దీపావళి కానుకగా హాట్ స్టార్ లో విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. ఇటీవలీ కాలంలో విడుదలవుతున్న ప్రతీ సినిమా కాంట్రవర్సీలతో పబ్లిసిటీ చేసుకుంటుండటం గమానార్హం.

Back to top button