అత్యంత ప్రజాదరణఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ఆంధ్రప్రదేశ్ప్రత్యేకంబ్రేకింగ్ న్యూస్రాజకీయాలు

బ్రేకింగ్: కరోనా ఎఫెక్ట్: ఆస్పత్రికి పవన్

Breaking: Corona Effect: Pawan to the hospital

వకీల్ సాబ్ మూవీ ఘనవిజయంతో జోష్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ ఫంక్షన్ తోనే కరోనా బాధితుడిగా మారిపోయిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ ప్రీరిలీజ్ లో పాల్గొన్న పవన్ సన్నిహితులు, సిబ్బంది అందరికీ కరోనా సోకడంతో పవన్ వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఈ మేరకు జనసేన ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే క్వారంటైన్ నుంచే పార్టీ, సినిమా వ్యవహారాలు పర్యవేక్షస్తున్న పవన్ ఆరోగ్య పరిస్థితి దిగజారినట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా క్వారంటైన్ నుంచి పవన్ ఆస్పత్రికి వెళ్లారని తెలుస్తోంది. ఈ మేరకు ఆస్పత్రిలో పవన్ నడుస్తున్న ఒక ఫొటో బయటకు వచ్చింది.

పవన్ కళ్యాణ్ కు కరోనా ఎఫెక్ట్ అయ్యిందని అందుకే ఆస్పత్రికి వెళ్లారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలియగానే పవన్ ఫ్యాన్స్, మెగా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

ఆస్పత్రి వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఊపిరి తీసుకోవడంతో ఇబ్బందులు తలెత్తడంతో పవన్ హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారని.. పరీక్షలు చేయించుకున్నారని సమాచారం. ఊపిరితిత్తుల్లో స్వల్ప ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తేలిందని వార్తలు వస్తున్నాయి.

వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఫంక్షన్ తర్వాత నిర్మాత దిల్ రాజుతోపాటు బండ్ల గణేష్ సైతం కరోనా బారినపడి ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పుడు  పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ఏంటనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Back to top button