క్రీడలువైరల్

బ్రేకింగ్ : అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఎంఎస్ ధోనీ!

భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ.... అంతర్జాతీయ క్రికెట్ నుండి సెలవు తీసుకున్నాడు.

భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ…. అంతర్జాతీయ క్రికెట్ నుండి సెలవు తీసుకున్నాడు. ప్రపంచంలోనే బెస్ట్ కెప్టెన్ లలో ఒకడైన ధోని భారత్ కు టీ-20 ప్రపంచ కప్ ను, వన్డే ప్రపంచ కప్ ను రెండింటినీ అందించిన ఏకైక సారథిగా ఘనత సాధించాడు.

Also Read: ఆగస్టు 15న కరోనా వ్యాక్సిన్ గురించి అద్భుతమైన మాట చెప్పిన మోడీ…!

ప్రపంచంలో ఏ క్రికెట్ జట్టు కెప్టెన్ కూడా రెండు ప్రపంచ కప్ లతో కలిపి చాంపియన్స్ ట్రోఫీని… అనగా 3 icc ట్రోఫీలను గెలిచింది లేదు. ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్ ధోనీ. అలాగే ధోనీ నేతృత్వంలోని భారత జట్టు మొట్టమొదటిసారి టెస్ట్ క్రికెట్లో నెంబర్ వన్ స్థానాన్ని కూడా అందుకుంది.

Also Read: ఉదారవాదులా? అవకాశావాదులా?

2019 ప్రపంచ కప్ తర్వాత ఇప్పటివరకు మైదానంలోకి దిగని ధోని ఒక్కసారిగా…. తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో తన వ్యక్తిత్వానికి తగ్గట్టు కూల్ గా తన రిటైర్మెంట్ ను ఒక వీడియో ద్వారా ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటనతో భారత దేశంలోని ధోని అభిమానులతోపాటు యావత్తు క్రికెట్ అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ధోని రిటైర్మెంట్ ఊహించినదే అయినా ఐపీఎల్ మొదలయ్యే సమయంలో ధోనీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే ఈ సంవత్సరం ఐపీఎల్ కు మాత్రం ధోనీ అందుబాటులో ఉంటాడని అధికారవర్గాల సమాచారం.

Tags
Back to top button
Close
Close