అంతర్జాతీయంఇంటర్నేషనల్బ్రేకింగ్ న్యూస్రాజకీయాలు

బ్రేకింగ్: అమెరికాలో కాల్పులు.. పదిమంది మృతి

Breaking: Shooting in America.. Ten killed

అమెరికా మరోసారి రక్తసిక్తమైంది. కాల్పుల మోతతో దద్దరిల్లింది. కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్ లో గుర్తు తెలియని దుండగుడు ఓ సూపర్ మార్కెట్ లో చొరబడి వినియోగదారులపై విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు.

కాల్పుల శబ్ధాలతో భయాందోళనకు గురైన స్టోర్ లోని వినియోగదారులు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం ఇది రెండోసారి.

బౌల్డర్ లోని కింగ్ సూపర్ మార్కెట్ లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల్లో పోలీస్ అధికారి అధికారి సహా మొత్తం 10 మంది మృతి చెందారు.

కాల్పులు జరిపిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఒఖరిని అదుపులోకి తీసుకున్నాం. దాడికి గల కారణాలేంటనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు.

ఇటీవలే అట్లాంటాలోని రెండు వేర్వేరు మసాజ్ పార్లర్లపై దుండగులు కాల్పులకు పాల్పడడం సంచలనమైంది. ఈ దాడిలో 8మంది మరణించారు. తాజాగా మరో దాడితో అమెరికాలో భారీగా నిరసనలు వెల్లువెత్తాయి.

Back to top button