విద్య / ఉద్యోగాలు

పది పాసైన వాళ్లకు శుభవార్త.. 459 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

BRO Recruitment 2021

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 459 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. http://bro.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు కాగా 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని తెలుస్తోంది. http://bro.gov.in/writereaddata/linkimages/4614759373-1.pdf లింక్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

పదో తరగతి పాసైన వాళ్లు రేడియో మెకానిక్స్, మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్ట్ ల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్ స్ట్రీమ్ నుంచి 12వ తరగతి పాసైన అభ్యర్థులు డ్రాఫ్ట్స్ మెన్, స్టోర్ కీపర్ టెక్నికల్ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేబరేటరీ మెడికల్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ ఉన్నవాళ్లు స్టోర్ సూపర్ వైజర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే అభ్యర్థులు 100 మార్కులకు నిర్వహించే పరీక్షలో పాస్ కావాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ లో కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కమాండెంట్, జి ఆర్ ఈ ఎఫ్ సెంటర్, డిఘీ క్యాంప్, పూణే – 411 015 అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.

Back to top button