విద్య / ఉద్యోగాలు

బీఎస్‌ఎఫ్‌ లో ఎస్సై, ఇన్‌స్పెక్టర్‌ జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

దేశ సరిహద్దు భద్రతా దళంలోని గ్రూప్‌ బీ, సీ విభాగాలకు సంబంధించి ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ రిలీజైంది. బీఎస్‌ఎఫ్‌ జాబ్‌ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 70 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఆఫ్ లైన్ లో కూడా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

బీఎస్‌ఎఫ్‌ ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా జూనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌, అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌, సీనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌, సీనియర్‌ రేడియో మెకానిక్‌ (ఇన్‌స్పెక్టర్‌), అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, జూనియర్‌ ఫ్లైట్‌ ఇంజినీర్‌, ఇన్‌స్పెక్టర్‌ లేదా స్టోర్‌మ్యాన్‌, రేడియో మెకానిక్ ఉద్యోగ ఖాళీల భర్తీ చేయనుంది. http://bsf.nic.in/ వెబ్ సైట్ ద్వారా 70 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఉద్యోగాలను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. కేవలం ఆఫ్ లైన్ లోనే మాత్రమే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటం గమనార్హం. ఉద్యోగ ఖాళీలను పరిశీలిస్తే సీనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌ ఉద్యోగ ఖాళీలు 12, అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌ ఉద్యోగ ఖాళీలు 8 ఉన్నాయి.

సీనియర్‌ రేడియో మెకానిక్‌ ఉద్యోగ ఖాళీలు 5 ఉండగా జూనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌ ఉద్యోగ ఖాళీలు 4, అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ రేడియో మెకానిక్‌ ఉద్యోగ ఖాళీలు 3, సీనియర్‌ ఫ్లైట్‌ గన్నర్‌ 1, జూనియర్‌ ఫ్లైట్‌ గన్నర్‌ 4, సీనియర్‌ ఫ్లైట్‌ ఇంజినీర్‌ 1, జూనియర్‌ ఫ్లైట్‌ ఇంజినీర్‌ 4, ఇన్‌స్పెక్టర్‌ లేదా స్టోర్‌మ్యాన్‌ 4, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగ ఖాళీలు 4, కానిస్టేబుల్‌ ఉద్యోగ ఖాళీలు 4 ఉన్నాయి.

Back to top button