విద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త.. 70 ఎస్సై, ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలు..?

దేశ సరిహద్దు భద్రతా దళం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 70 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గ్రూప్‌ బీ, సీ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ చివరి వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

బీ.ఎస్.ఎఫ్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్‌ ఫ్లైట్‌ ఇంజినీర్‌, ఇన్‌స్పెక్టర్‌ లేదా స్టోర్‌మ్యాన్‌, జూనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌, అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌, సీనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌, సీనియర్‌ రేడియో మెకానిక్‌ (ఇన్‌స్పెక్టర్‌), అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ రేడియో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. http://bsf.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా నోటిఫికేషన్ ద్వారా విద్యార్హతలను బట్టి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. http://bsf.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం ఉద్యోగ ఖాళీలలో సీనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌ ఉద్యోగాలు 12 ఉండగా సీనియర్‌ రేడియో మెకానిక్‌ ఉద్యోగ ఖాళీలు 5 ఉన్నాయి.

అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌ ఉద్యోగ ఖాళీలు 5 ఉండగా జూనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌ ఉద్యోగ ఖాళీలు 4 ఉన్నాయి. అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ రేడియో మెకానిక్‌ ఉద్యోగ ఖాళీలు 3 ఉండగా జూనియర్‌ ఫ్లైట్‌ ఇంజినీర్‌, ఇన్‌స్పెక్టర్‌ లేదా స్టోర్‌మ్యాన్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌ ఉద్యోగ ఖాళీలు 4 చొప్పున ఉన్నాయి.

Back to top button