ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

Btech student murder: బీటెక్ విద్యార్థి హత్యకు ముందు 8 నిమిషాలు..

btech student muder at guntur

ఏపీలోని గుంటూరు కాకాని రోడ్డులో బీటెక్ విద్యార్థిని హత్య కలకలం రేపింది. ఓ దుండగుడు విద్యార్థిని రమ్యను కత్తితో పొడిచి పొడిచి చంపడం తీవ్ర విషాదం నింపింది. అయితే పోలీసులు ఈ కేసులో కీలక విషయాలను రాబట్టారు. హత్యకు పాల్పడిన యువకుడిని గుర్తించినట్టు తెలిసింది. హత్యకు ముందు 8 నిమిషాల పాటు వారిద్దరి మధ్య ఏం జరిగిందనేది తేలింది.

ఓ ప్రైవేటు పాఠశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న రమ్య కాకాని రోడ్డులో వెళుతుండగా అటు వచ్చిన ఓ యువకుడు తన బైక్ ఎక్కాలని కోరాడు. కానీ రమ్య అందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో యువకుడు రమ్య మెడక, పొట్ట భాగంలో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.

రక్తమోడుతున్న యువతిని స్థానికులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మొత్తం ఆరు చోట్ల కత్తి పోట్లు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

రమ్య హత్య కేసులో శశికృష్ణ అనే యువకుడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు ముందు 8 నిమిషాల పాటు రమ్యతో యువకుడు వాగ్వాదానికి దిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. వాగ్వాదం తర్వాత కొద్దిసేపటికే హత్య జరిగినట్లు గుర్తించారు. హత్య జరిగిన తర్వాత దగ్గరకు రావొద్దని శశికృష్ణ కత్తితో స్థానికులను బెదిరించినట్లు తెలుస్తోంది.

ఇక నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మృతురాలు రమ్య మృతదేహాన్ని హోంమంత్రి సుచరిత పరిశీలించారు. నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. రమ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. విచారణ త్వరగా పూర్తి చేసి హంతకుడికి శిక్ష పడేలా చేస్తామన్నారు. రమ్య ఫోన్ లాక్ ఓపెన్ చేస్తే మరింత సమాచారం తెలుస్తుందని.. పోలీసులు లాక్ ఓఫెన్ చేసే పనిలో పడ్డారు.

Back to top button