ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

Btech student murder: కానిస్టేబుల్ సాహసమే క్రిమినల్ ను పట్టించింది

బీటెక్ విద్యార్థిని హత్య కేసులో ప్రాణాలకు తెగించి నిందితుడు శశికృష్ణను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ రఫీ

పట్టపగలు.. నడిరోడ్డు మీద.. గుంటూరు నగరంలో అందరూ చూస్తుండగానే బీటెక్ విద్యార్థిని రమ్యను హత్య చేసిన ప్రేమోన్మాది శశికృష్ణ నిజానికి తనకు తానుగా లొంగిపోలేదు. ఆ క్రిమినల్ ను వేటాడి వెంటాడి.. ఏకంగా కాలువలోకి దూకి మరీ అతడి చేతిలో కత్తులున్నా కూడా భయపడకుండా అతడిని పట్టుకుంది ఓ పోలీస్. ఆ పోలీస్ సాహసం గురించి తాజాగా తెలిసి వచ్చింది. ఆ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి మరీ ఆ నిందితుడు శశికృష్ణను అరెస్ట్ చేయబట్టే దొరికిపోయాడని తెలిసింది. లేకుండటే పరారీలోనే అతడు ఉండేవాడు.

రమ్యశ్రీ హత్య కేసులో ముద్దాయిని పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ ని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ప్రత్యేకంగా పిలిపించి మరీ అభినందించడం విశేషం. గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో జరిగిన బీటెక్ విద్యార్థిని హత్య కేసులో పారిపోతున్న ముద్దాయిని వెంబడించి పట్టుకున్న ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రఫీ తన ధైర్యసాహసాలు మెచ్చుకుంటూ గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ప్రశంసలు కురిపించారు. అతడి సాహసాన్ని మీడియాకు వివరించారు.

కాలువలో దూకి మరీ ముద్దాయిని వెంబడించి వైనం.. మారణాయుధముతో బెదిరించినా వెన్నుచూపని ధీరత్వం కానిస్టేబుల్ రఫీ సొంతమని ఎస్పీ ప్రశంసించాడు. చాకచక్యంగా ముద్దాయిని పట్టుకున్న నేర్పరితనం పోలీస్ శాఖకు కీర్తిప్రతిష్ఠలు తెచ్చిన సాహసం గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు.

జిల్లా పోలీస్ అధికారులతో పాటు తోటి సిబ్బంది మన్ననలు పొందిన హెడ్ కానిస్టేబుల్ రఫీ చూపిన దైర్యసహాసాలు స్ఫూర్తినిస్తాయన్నారు. అతని ధైర్య సాహసానికి మెఛ్చి రూ. 5000 నగదు రివార్డ్.. ప్రశంసా పత్రంను జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ప్రకటించారు.

విధి నిర్వహణ పట్ల అంకితభావం కలిగిన సిబ్బంది రూరల్ జిల్లాలో ఉండటం గర్వకారణం అని ఎస్పీ కొనియాడారు. తన సిబ్బందిని దగ్గరుండి ప్రోత్సహించినందుకు ముప్పాళ్ళ ఎస్ఐ పట్టాభిరామయ్యకి రూరల్ ఎస్పీ అభినందనలు తెలిపారు.

పోలీస్ అధికారులు ఇటువంటి సిబ్బందిని గుర్తించి వారిని ప్రోత్సహించాలని ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో రఫీ చూపిన తెగువ గుంటూరు రూరల్ జిల్లా పోలీసులకే కాదు యావత్ ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖకే గర్వకారణం అని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ప్రశంసలు కురిపించారు.

దీన్ని బట్టి కరుడుగట్టిన ఆ ప్రేమోన్మాది శశికృష్ణ పారిపోవడానికి చాలా ప్రయత్నించాడని హెడ్ కానిస్టుబుల్ రఫీ చొరవ వల్లే అతడు పోలీసులకు చిక్కాడని తెలుస్తోంది.

Back to top button