ప్రత్యేకంవ్యాపారము

ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బంపర్ ఆఫర్… రూ.7000 వరకు డిస్కౌంట్..!

మరికొన్ని రోజుల్లో దసరా, దీపావళి పండుగలు ఉన్నాయి. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఈ సంవత్సరం ప్రజల కొనుగోలు శక్తి భారీగా తగ్గింది. గతేడాదితో పోలిస్తే తక్కువ వేతనానికే పని చేస్తున్న వేతన జీవుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో బ్యాంకులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు పండుగల సందర్భంగా అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారుల డెబిట్, క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి బ్యాంకులు కళ్లు చెదిరే ఆఫర్లను ఇస్తున్నాయి.

ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు భారీ డిస్కౌంట్లతో ఆఫర్లను ప్రకటిస్తుండగా ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నవాళ్లు భారీగా క్యాష్ బ్యాక్ లను పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు టాటా క్లిక్, అమెజాన్ లాంటి సైట్లలో ఎంపిక చేసిన ప్రోడక్టులపై 7000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. అయితే కేవలం యాపిల్ ప్రోడక్టులను కొనుగోలు చేస్తే మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది.

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లు 9643222222 నంబర్ కు రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి డెబిట్ కార్డుపై ఆరు నెలల వరకు ఆరు నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ను పొందవచ్చు. కస్టమర్లు మ్యాక్ బుక్ ఎయిర్ ను కొనుగోలు చేస్తే 7,000 రూపాయల క్యాష్ బ్యాక్ ను సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అమెజాన్, టాటా క్లిక్ హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు ఆఫర్ అందిస్తుంటే ఎస్బీఐ ఫ్లిప్‌కార్ట్‌ లో తమ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా షాపింగ్ చేసిన వారికి 7,000 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నిన్న ప్రారంభం కాగా అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ నేడు ప్రారంభమైంది. రెండు ఈ కామర్స్ సంస్థలు కస్టమర్లను ఆకర్షించడం కోసం ఫోన్లు, ల్యాప్ టాప్ లపై భారీగా డిస్కౌంట్లు ఇస్తూ ఉండటం గమనార్హం. ఆఫ్రలలో ప్రోడక్టులను కొనే ముందు రివ్యూలను చూసి కొనుక్కోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

Back to top button