జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

ఐసీసీ ర్యాంకింగ్స్ లో పైకి బుమ్రా.. కిందికి కోహ్లీ

Bumra up in ICC rankings .. Kohli down

తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో బుమ్రా పైకెళ్లగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ కిందికి జారాడు. బౌలింగ్ విభాగంలో ఇద్దరు భారతీయ బౌలర్లకు టాప్-10 చోటుదక్కగా బ్యాట్స్ మెన్ విభాగంలో ముగ్గురు జాబితాలోకి వచ్చారు. టెస్ట్ బౌలర్ల  ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో బూమ్రా 10 స్థానాలు ఎగబాకి 9వ స్థానానికి చేరుకున్నాడు. మరో భారత బౌలర్ రవిచంద్ర ఆశ్విన్ తన రెండో స్థానాన్ని నిలుపుకున్నాడు. కాగా, బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ కోహ్లీ ఒక స్థానం కిందికి జారి 5 వ స్థానానికి వచ్చాడు. ఆయన తర్వాత 6వ స్థానంలో రోహిత్ శర్మ, 7 లో రిషబ్ పంత్ ఉన్నారు.

Back to top button