సినిమాసినిమా వార్తలు

‘పుష్ప’ సినిమాపై బన్నీ షాకింగ్ నిర్ణయం

Bunny shocking decision on ‘pushpa’ movie

కరోనా బారినపడ్డ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ వచ్చింది. ఈ స్టైలిష్ స్టార్ ఇటీవల పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక పుష్ప యూనిట్ సభ్యులకు సైతం ఈ వైరస్ సోకింది.

హోం ఐసోలేషన్ లో ఉన్న అల్లు అర్జున్ తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు స్పష్టతనిచ్చాడు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.

తాజాగా బన్నీ ట్వీట్ చేశాడు. తానే బాగానే కోలుకున్నానని.. స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. కంగారు పడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. అయితే వైరస్ తొలిగే వరకు ఇంకా క్వారంటైన్ లోనూ ఉంటానని వివరించారు.

ఇక సోషల్ మీడియాలో తాను కోలుకోవాలని కోరుకున్న అభిమానులందరికీ బన్నీ థాంక్స్ చెప్పాడు. పుష్ప షూటింగ్ లో వైరస్ బారినపడ్డ అల్లు అర్జున్ ఆ సినిమా షూటింగ్ ను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఓవైపు కరోనా కేసులు పెరుగుతుండడం.. భారీ యూనిట్ తో షూటింగ్ జరపడం శ్రేయస్కరం కాదని వివరణ ఇచ్చారు. ఇక డైరెక్టర్ సుకుమార్ కూడా కరోనా ఐసోలేషన్ లోకి వెళ్లిపోవడంతో ఇక ఇప్పట్లో పుష్ప సినిమా షూటింగ్ జరపలేమని.. పరిస్థితులు చక్కబడ్డాక మొదలుపెడుతానని బన్నీ వివరణ ఇచ్చారు.

Back to top button