టాలీవుడ్సినిమా

 ‘పుష్ప’తో బన్నీ స్టైల్.. ఇమేజ్ మారనుందా?

Pushpa Movie

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో గతంలో ‘ఆర్య’..‘ఆర్య-2’ మూవీలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా అల్లు అర్జున్ ను స్టైలీష్ స్టార్ గా.. లవర్ బాయ్ గా మార్చేశాయి. వీరిద్దరి కలయికలో హట్రిక్ మూవీగా ‘పుష్ప’ రాబోతుంది. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Also Read: బిగ్ బాస్-4: అభిజిత్ సీక్రెట్ రిలీవ్ చేసిన తల్లి.. ఆటడేసుకున్న కంటెస్టెంట్స్..!

‘పుష్ప’ మూవీ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఇందులో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. బన్నీ తొలిసారిగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందుకు తగ్గట్టుగానే అల్లు అర్జున్ రఫ్ అండ్ టఫ్ లుక్కులో ఊరమాస్ గా కన్పిస్తున్నారు.

అల్లు అర్జున్ సంబంధించి ఫస్టు లుక్ రిలీజైనపుడే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. కరోనా సమయంలోనూ ఇటీవలే ‘పుష్ప’ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో చిత్రబృందం రిలీజ్ చేయగా వైరల్ అయింది. తాజాగా అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.

Also Read: ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ మూడు కథలను సిద్ధం చేశాడా?

‘పుష్ప’ షూటింగులో అల్లు అర్జున్ పాల్గొనగా ఇందుకు సంబంధించిన కొన్ని పిక్స్ లీకయ్యాయి. ఆ మధ్య బన్నీ కరోనా టైంలో మసినగడ్డం.. పెరిగిన జట్టుతో కన్పించినట్టుగా ఈ సినిమా షూటింగులో కన్పించాడు. రఫ్ లుక్ లో ఆయిల్ స్కిన్ టోన్ తో కనిపించాడు. ఇది చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే విజువల్ మాత్రం అదిరిపోనుందని తెలుస్తోంది. మొత్తానికి ‘పుష్ప’ బన్నీ స్టైల్ తోపాటు ఇమేజ్ మార్చడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button